గోపీచంద్ కు మరో అవకాశం ఇచ్చిన బాలయ్య, ఈసారి రచ్చ మామూలుగా ఉండదు మరి?

Published : May 26, 2025, 10:23 PM IST
balayya

సారాంశం

వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న బాలయ్య.. డబుల్ హ్యాట్రిక్ పై కన్నేశారు. ఈక్రమంలో తనకు వీర సింహారెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన మలినేని గోపీచంద్ కు మరో అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి సక్సెస్ లతో దూకుడు మీద ఉన్నాడు. ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి ‘అఖండ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది.

తాజా సమాచారం ప్రకారం, బాలయ్య బాబు త్వరలోనే మరో భారీ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నారు. ఈసినిమాను మలినేని గోపీచంద్ తో చేయబోతున్నాడట బాలయ్య. ఇప్పటికే గోపీచంద్, బాలయ్యకు ఓ కథను వినిపించినట్టు సమాచారం. ఆ కథ బాలయ్యకు నచ్చడంతో, ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.

జూన్ 10, బాలయ్య పుట్టినరోజు కావడంతో, ఆరోజు కొత్త సినిమాను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. బాలయ్య ఫ్యాన్స్ కోసం ప్రత్యేక బర్త్‌డే గిఫ్ట్‌గా ఈ సినిమాను అనౌన్స్ చేయవచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇక గోపీచంద్ మలినేని విషయానికి వస్తే, ఇటీవలే బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ తో ఓ హిట్ సినిమా అందుకున్నారు. ఇప్పుడు, ఆయన మరోసారి తెలుగు మాస్ హీరో బాలయ్యతో కలసి పనిచేయబోతున్నారు.ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే అవకాశం ఉందని సమాచారం. గతంలో గోపీచంద్ మలినేని – మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో హిట్ సినిమాను చేసిన సంగతి తెలిసిందే.

ఇందుకే బాలయ్య-గోపీచంద్ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి. అధికారిక ప్రకటన కోసం  అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అఖండ 2 పూర్తయిన వెంటనే ఈ కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ కాంబినేషన్ తెలుగు సినీ పరిశ్రమలో మరో మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్‌గా నిలవడం ఖాయం అని ఫ్యాన్స్ అంటున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..