మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్స్ హైదరాబాద్‌లో ఏం తింటున్నారో తెలుసా?

Published : May 26, 2025, 09:24 PM IST
Miss World 2025 contestants in Hyderabad enjoy mild biryani, millet dishes, and local Telangana flavors

సారాంశం

హైదరాబాద్, తెలంగాణ, మిస్ వరల్డ్ 2025 పేజెంట్‌కు ఆతిథ్యం ఇస్తుండగా, 108 మంది అందాల భామలు భాగ్యనగరంలో తింటున్న ఆహారం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. వారు కేవలం సలాడ్లు తింటారా లేక.. ? లేక ఇడ్లీ, డోస, వడ వంటి స్థానిక వంటకాలను ఆస్వాదిస్తున్నారా?

 

మిస్ వరల్డ్ 2025, మొత్తం 25 రోజులు జరిగే ఈ ఈవెంట్ ఫైనల్ మే 31, 2025న హిటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైదరాబాద్లో జరగనుంది. ట్రైడెంట్‌ హోటల్ లో మిస్ వరల్డ్ బృందానికి చెందిన 157 మంది అతిథులు ఉంటున్నారు. contestants కోసం ప్రత్యేకంగా టస్కనీ రెస్టారెంట్ ను కేటాయించారు. అమారా (మల్టీ క్యూసిన్), కనక్ (ఇండియన్), టస్కనీ (ఇటాలియన్)—ఈ మూడు రెస్టారెంట్ల డిష్‌లను మెనూలో చేర్చారు. అంతర్జాతీయ రుచులతో పాటు లోకల్ గా ఫేమస్ వంటకాలను కూడా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు రుచి చూపించారని తెలుస్తోంది.

నార్త్ ఇండియన్ వంటకాలు పాలక్ పనీర్, దాల్‌లు, మలాయ్ మారినేడ్‌లో గ్రిల్ చేసిన మాంసాహారం, ఇండియన్ బ్రెడ్లు వంటి వంటకాలను తక్కువ మసాలాతో వండుతున్నారు. ఇక అంతర్జాతీయ వంటకాల్లో బీట్‌రూట్-ఫెటా సలాడ్, గ్రిల్ చికెన్, ఎగ్ సలాడ్, స్వీట్ పోటాటో సలాడ్, మిల్లెట్ బ్రెడ్, తక్కువ నూనెతో తయారైన వెజిటబుల్ స్టిర్ ఫ్రైలు ఉన్నాయి. అలాగే అద్భుతమైన జ్యూసులు కూడా అందిస్తున్నారు.

ఇక తెలంగాణలో ఈ పోటీలు జరుగుతుండటంతో ఇక్కడి లోకల్ వంటలను కూడా వారికి రుచి చూపిస్తున్నారు టీమ్ . మరీ ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ కూడా మెనూలో భాగమైంది. మిర్చి లేకుండా, చాలా తక్కువ కారంగా తయారైన బిర్యానీని మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు వడ్డిస్తున్నారు. అంతే కాదు వారు ఈ బిర్యానీని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన contestant హనా జాన్స్ మాట్లాడుతూ మూడు రోజులు బిర్యానీ తిన్నాను, ఇంకా తినాలనిపిస్తోంది అని అన్నారు.

కెన్యాకు చెందిన గ్రేస్ రామ్‌టు కి మాత్రం మన లోకల్ చికెన్ కర్రీ బాగా నచ్చింది. ఆమె ఆ కూరను చాలా ఇష్టంగా తిన్నారు. ఇక వెగన్ contestants కోసం మిల్లెట్, రా జాక్‌ఫ్రూట్, స్వీట్ పోటాటోతో తేలికపాటి గ్రేవీలలో వంటలు వండుతున్నారు. డెజర్ట్స్ విషయంలో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. రోజా, పిస్తా ఐస్‌క్రీమ్‌లు, ఫ్లోర్‌లెస్ కేక్, ఖర్జూరంతో చేసిన లడ్డూ, హెల్తీ బైట్స్ వంటి డెజర్ట్స్ మెనూలో ఉన్నాయి.

ఇలా స్థానిక వంటకాలను గ్లోబల్ టచ్‌తో కలిపి, ప్రతి ఒక్కరి డైట్ అవసరాలను పరిగణలోకి తీసుకుని ట్రైడెంట్ హోటల్ ప్రత్యేకమైన మెనూను రూపొందించింది. Miss World 2025 పేజెంట్‌కు మాత్రమే కాదు, తెలంగాణ రుచులకు కూడా ఇది ఒక గ్లోబల్ స్టేజ్‌గా నిలుస్తోంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు