క్రిష్ కు 'ఎన్టీఆర్' చేయడం ఇష్టం లేదా?

Published : Jul 13, 2018, 04:14 PM IST
క్రిష్ కు 'ఎన్టీఆర్' చేయడం ఇష్టం లేదా?

సారాంశం

దివంగత నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందించాలనుకున్నాడు. దీనికోసం ముందుగా దర్శకుడు తేజతో కలిసి వర్క్ మొదలుపెట్టడం, సినిమా షూటింగ్ ఆరంభంలోనే తేజ ఆ సినిమాను వదిలిపెట్టి వెళ్లడం జరిగిపోయాయి

దివంగత నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందించాలనుకున్నాడు. దీనికోసం ముందుగా దర్శకుడు తేజతో కలిసి వర్క్ మొదలుపెట్టడం, సినిమా షూటింగ్ ఆరంభంలోనే తేజ ఆ సినిమాను వదిలిపెట్టి వెళ్లడం జరిగిపోయాయి. దీంతో తేజ స్థానంలో బాలకృష్ణ.. దర్శకుడు క్రిష్ ను రంగంలోకి దించాడు. నిజానికి క్రిష్ కు ఈ సినిమా చేయడం ఇష్టం లేదట.

కానీ బాలకృష్ణ ఫోర్స్ చేయడంతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వక తప్పలేదు. ఈ సినిమా సెట్స్ లోకి రాకముందే తను కమిట్ అయిన 'మణికర్ణిక' సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు. ఆ సినిమా షూటింగ్ బ్యాలన్స్ ఉన్న కారణంగానే 'ఎన్టీఆర్' సెట్స్ లో జాయిన్ అవ్వడానికి సమయం తీసుకున్నాడు. మొత్తం షూటింగ్ పూర్తి చేసి ఇప్పుడు 'ఎన్టీఆర్' షూటింగ్ మొదలుపెట్టాడు. బలవంతంగా ఈ సినిమాను డైరెక్ట్ చేయాల్సి వస్తున్నా.. తప్పక బాలకృష్ణ కోసం క్రిష్ తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కాస్టింగ్ ను సెలెక్ట్ చేస్తూనే కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారు.

అయితే ఇప్పుడు 'మణికర్ణిక' సినిమా క్రిష్ కు కొత్త తలనొప్పులు తీసుకొస్తుందని సమాచారం. ఆ సినిమాకు రైటర్ గా పని చేసిన విజయేంద్రవర్మ సినిమాలో కొన్ని సన్నివేశాలు సరిగ్గా రాలేదని వాటిని మళ్లీ రీషూట్ చేయాలని అంటున్నాడట. దీంతో ఇప్పుడు క్రిష్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఓ పక్క ఈ షూటింగ్ వదిలేసి 'మణికర్ణిక' కోసం వెళ్లలేడు. అలా అని ఆ సినిమాను వదిలేయలేక క్రిష్ సతమతమవుతున్నట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

డీమాన్‌ పవన్‌ పక్కా ప్లాన్‌ ప్రకారమే రీతూ చౌదరీతో లవ్ ట్రాక్‌ పెట్టుకున్నాడా? శ్రీజ చెప్పిన సంచలన నిజం
Kiccha Sudeep Daughter: సింగర్ గా గుర్తింపు పొందిన స్టార్ హీరో కూతురు.. త్వరలోనే నటిగా ఎంట్రీ ?