బాలయ్య వస్తేనే తాళి కడతా... మూడేళ్ళుగా పెళ్లి వాయిదా వేస్తూవస్తున్న అభిమాని

Published : Mar 10, 2023, 11:44 AM IST
బాలయ్య వస్తేనే తాళి కడతా... మూడేళ్ళుగా పెళ్లి వాయిదా వేస్తూవస్తున్న అభిమాని

సారాంశం

అభిమానం తలకెక్కితే.. ఎవరు చెప్పినా వినరు. ముఖ్యంగా హీరోలపై అభిమానంతో ఎంతదూరం వెళ్ళడానికైనా వెనకాడరు ఫ్యాన్స్. రీసెంట్ గా ఓ అభిమాని అలాంటి పనే చేశాడు. బాలకృష్ణ మీద అభిమానంతో.. ఆయన వస్తేనే కాని పెళ్ళి చేసుకోను.. తాళి కట్టను అంటున్నాడు. 


సినిమా హీరోల కోసం.. ఫ్యాన్స్ చేసే హాడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమాన హీరోల కోసం ప్రాణాలు వదిలిని వారు కూడా లేకపోలేదు. ఇక తమ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు  థియేటర్లకు వెళ్లి కాగితాలు చింపడం, చొక్కాలు చింపుకోవడం.. రచ్చ రచ్చ చేస్తుంటారు ఫ్యాన్స్. ఇక ఈ విషయంలో అంతకు మించి అన్నట్టు గా ఉంటారు బాలయ్య ఫ్యాన్స్.  ఆయనపై అంతులేని అభిమానంతో... వారు చేసే పనులు ఒక్కోసారి చిత్రంగా అనిపిస్తుంటాయి. రీసెంట్ గా బాలయ్య అభిమాని చేసిన పనికి అంతా ఔరా అంటున్నారు. ఇంతకీ అంతలా అతను ఏం చేశాడంటే.. బాలకృష్ణ కోసం మూడేళ్ళుగా తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. 

బాలయ్య వస్తే కానీ పెళ్లి చేసుకునేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నాడు బాలకృష్ణ వీరాభిమాని. విశాఖపట్నం.. పెందుర్తి కి చెందిన కోమలీ పెద్దినాయుడు.. బాలకృష్ణకు వీరాభిమాని. అతనికి  గౌతమీ ప్రియ అనే అమ్మాయితో  2019లోనే ఎంగేజ్​మెంట్ అయిపోయింది. అయితే పెద్దినాయుడితో పాటు గౌతమి కూడా బాలయ్య అభిమాని.  బాలయ్య అంటే పడిచచ్చే పెద్దినాయుడు.. తన పెళ్లికి రావాల్సిందిగా వైజాగ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా బాలయ్యను ఆహ్వానించాడు. అయితే  ఖాళీగా లేకపోవడం అప్పట్లో ఆయన రాలేకపోయారు. ఆతరువాత  కరోనా వల్ల లాక్​డౌన్ వల్ల బాలకృష్ణకు ఆ పెళ్లికి రావడం కుదరలేదు. 

అయితే అప్పటి నుంచి పెద్ది నాయుడు పెళ్లి చేసుకోకుండా బాలయ్య రాకకోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. బాలయ్య వస్తేనే తాను తాళి కడతాను అని దాదాపు మూడేళ్లుగా ఎదరుచూస్తున్నాడు పెద్దినాయుడు. అంతే కాదు ఈమధ్యలో బాలక్రిష్ణకు వీలు కుదిరేలా ఓరెండు మూడు ముహూర్తాలు కూడా పెట్టించాడట. కాని అప్పుడు కూడా బాలక్రిష్ణ రాకపోవడంతో.. తాజాగా ఈనెల 11న మరోసారి పెళ్ళి ముహూర్తం కుదుర్చుకున్నాడు పెద్దినాయుడు. ఈపెళ్ళికి బాలయ్య వస్తానని హామీ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. 

ఇక ఇన్నాళ్లు పెళ్లి జరగకుండా ఎలా ఆపగలిగారు, అమ్మాయి తరపు నుంచి ఎలాంటి ప్రెజర్ రాలేదా అని అతన్ని ప్రశ్నించగా..? తాను చేసుకోబోయే అమ్మాయి.. ఆమె ఫ్యామిలీతో పాటుగా మా ఊరు మొత్తం బాలకృష్ణకు వీరాభిమానులమే.. అందుకే ఇదంతా సాధ్యం అయ్యింది అని అంటున్నాడు పెళ్ళి కొడుకు. అంతే కాదు రేపు పెళ్ళికి బాలయ్య వస్తున్నాడని.. గ్రాండ్ గా వెల్కం చెప్పడానికి.. ఊరు ఊరంతా సిద్దం అవుతుంది. 

 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా