దేశంలోనే టాప్ హీరోగా... మైండ్ బ్లాక్ చేస్తున్న అల్లు అర్జున్ రెమ్యూనరేషన్!

By Sambi Reddy  |  First Published Mar 10, 2023, 10:43 AM IST


పుష్ప మూవీతో అల్లు అర్జున్ ఇమేజ్ దేశవ్యాప్తమైంది. ఆయన స్టార్డం ఊహించని రేంజ్ లో పెరిగింది. ఈ క్రమంలో నిర్మాతలు ఆయన వెనుకబడుతున్నారు. ఇటీవల అల్లు అర్జున్ ప్రకటించిన బాలీవుడ్ మూవీ రెమ్యూనరేషన్ షాకిస్తుంది. 
 


పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో చోటు సంపాదించారు హీరో అల్లు అర్జున్. పుష్ప మూవీ ఆయన రేంజ్ మార్చేసింది. నార్త్ మొత్తం అల్లు అర్జున్ భజన చేస్తుంది. పుష్ప మూవీ ఆయనకు ఊహించని ఇమేజ్ తెచ్చిపెట్టింది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన క్రైమ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ హిందీ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. పుష్ప హిందీ వర్షన్ వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో కలిపి రూ. 360 కోట్ల వసూళ్లు సాధించింది. పుష్ప సక్సెస్ అనంతరం అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ భారీగా పెంచేశారు. 

పుష్ప 2కి ఆయన రూ. 80 కోట్ల వరకు తీసుకుంటున్నారని సమాచారం. తాజాగా దాన్ని వంద కోట్లకు పైగా పెంచేశాడట. ఇటీవల అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రకటించిన మూవీకి అల్లు అర్జున్ రూ. 120 కోట్లు తీసుకుంటున్నారట. ఈ చిత్ర నిర్మాతగా ఉన్న భూషణ్ కుమార్... సంకోచించకుండా అల్లు అర్జున్ అడిగినంత ఇచ్చేశారట. మీరు మూవీ చేస్తే చాలన్నట్లు హ్యాపీగా ఫీలయ్యారట. దీంతో అల్లు అర్జున్ దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా రికార్డులకు ఎక్కారంటున్నారు. 

Latest Videos

ఇక సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు సమయం ఉందట. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పుష్ప 2 అనంతరం అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ తో ఒక మూవీ చేస్తారట. ఈ లోపు సందీప్ రెడ్డి వంగా హీరో ప్రభాస్ తో ప్రకటించిన స్పిరిట్ పూర్తి చేస్తారట. అనుకున్నట్లు జరిగితే 2025 లో సందీప్ రెడ్డి-అల్లు అర్జున్ ల మూవీ సెట్స్ పైకి వెళుతుందట. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించాల్సి ఉంది.   

ఈ ఏడాది చివర్లో పుష్ప 2 విడుదలయ్యే సూచనలు కలవు. పుష్ప సక్సెస్ నేపథ్యంలో సీక్వెల్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. చిత్ర బడ్జెట్ రూ. 300 కోట్లకు పెంచేశారట. దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశారంటున్నారు. వెయ్యికోట్ల వసూళ్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగుతున్నట్లు సమాచారం. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. 

click me!