వెంకటేశ్ మహా వివాదాస్పద వ్యాఖ్యలకు నాని కౌంటర్ ఇచ్చారా? నేచురల్ స్టార్ కామెంట్స్ వైరల్?

By Asianet News  |  First Published Mar 10, 2023, 11:12 AM IST

నేచురల్ స్టార్ ప్రస్తుతం ‘దసరా’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాని కామెంట్స్ ‘కేజీఎఫ్’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వెంకటేశ్ మహాకు కౌంటర్ గా ఉన్నట్టు నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.
 


నేచురల్ స్టార్ నాని  ప్రస్తుతం ‘దసరా’ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.  తొలిసారిగా పాన్ ఇండియన్ సినిమా రిలీజ్ కాబోతుండటంతో ప్రమోషన్స్ విషయంలో నానినే ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఫ్యాన్స్ మీట్ నుంచి ఇంటర్వ్యూలు, ఆయా కార్యక్రమాలకు ఆయనే హాజరవుతూ సినిమా రీచ్ పెరిగేలా చేస్తున్నారు. ప్రస్తుతం నాని ముంబైలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా నాని చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.  

అయితే, రెండ్రోజుల కింద K\O కంచెరపాలెం చిత్ర దర్శకుడు వెంకటేశ్ మహా (Venkatesh Maha) ‘కేజీఎఫ్’ సినిమాపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఆయన వివాదాస్పద కామెంట్స్ చేయడంతో నెటిజన్లు, యష్ ఫ్యాన్స్ ఆయనపై ట్రోల్స్ చేశారు. ఈ క్రమంలో నాని కమర్షియల్ సినిమాలపై చేసిన కామెంట్స్ ను వెంకటేశ్ మహాకు కౌంటర్ గా చూపిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలకు సరైన సమాధానం అంటున్నారు.  

Latest Videos

తాజాగా నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కమర్షియల్ సినిమాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం  చేశారు. కమర్షియల్ సినిమాలు లేకపోతే అస్సలు ఇండస్ట్రీలో డబ్బే కనిపించదు. ఆడియెన్స్ ను థియేటర్లలోకి రప్పించే సినిమాలు కూడా కమర్షియల్ సినిమాలే. కమర్షియల్ గా వచ్చిన సినిమా  హిట్ అయ్యిందంటే.. దానివెనకాల డైరెక్టర్ అండ్ టీం కొత్త అంశాలపై ఎంతో ఎఫెక్ట్ పెట్టారని  అర్థం. ఇండియన్ సినిమా స్ట్రాంగ్ గా ఉందంటే కమర్షియల్ సినిమాలే కారణం. మంచి సినిమాలు తీయాలన్న కమర్షియల్ సినిమాల అవసరం ఉంటుందని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.  

click me!