Balakrishna Boyapati combo: బాలయ్యతో బోయపాటి మరో సినిమా, కండీషన్స్ అప్లై అంటోన్న నటసింహం

Published : Apr 24, 2022, 09:36 PM IST
Balakrishna Boyapati combo: బాలయ్యతో బోయపాటి మరో సినిమా, కండీషన్స్ అప్లై అంటోన్న నటసింహం

సారాంశం

అఖండతో బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ కొట్టిన కాంబినేషన్ బాలయ్య బోయపాటిది. ఇక వీరి కాంబినేషన్ లో మరో సినిమాకు లైన్ క్లియర్ అవుతోంది. కాని బాలయ్య మాత్రం బోయపాటితో కండీషన్స్ అప్లై అంటున్నాడట.   

అఖండతో బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ కొట్టిన కాంబినేషన్ బాలయ్య బోయపాటిది. ఇక వీరి కాంబినేషన్ లో మరో సినిమాకు లైన్ క్లియర్ అవుతోంది. కాని బాలయ్య మాత్రం బోయపాటితో కండీషన్స్ అప్లై అంటున్నాడట. 

టాలీవుడ్ లో తమది తిరుగులేని కాంబినేషన్ అనిపించుకున్నారు బాలయ్య బోయాపాటి.  సింహా, లెజెండ్ తరువాత ఎంతో ఉత్కంఠ నడుమ రిలీజ్ అయిన అఖండ సినిమా.. ఆరెండింటికంటే ఎక్కువగానే బాలయ్యకు హిట్ ఇచ్చింది.  తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్ గా ఇద్దరికి ఇమేజ్ ను ఇచ్చింది. ఇక  బీసీ ఆడియెన్స్ కు తమ సినిమాలతో కడుపు నిండా వినోదాన్ని పంచిన బాలయ్య,బోయపాటి మళ్ళీ కలిసి సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స ఉవ్విళ్ళూరుతున్నారు. 

బాలయ్య, బోయపాటి కాంబో మళ్లీ రిపీట్ బాగుంటుందని టాలీవుడ్ జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక  బోయపాటి కూడా అదే పనిలో ఉన్నాడని సమాచారం.బాలయ్య, బోయపాటి సినిమా అనగానే చాలా మంది నోటి నుంచి అఖండ సీక్వెల్ మాటే వినిపిస్తోంది. ఈ విషయంలో చాలా మంది ఫ్యాన్స్ నుంచి డిమాండ్ వినిపించింది. ఆ విషయంలో బోయపాటి కూడా ఓ సారి క్లారిటీ ఇచ్చాడు. 

 సీక్వెల్ స్టోరీ రెడీగా ఉందని ఓ రియాలిటీ షోలో ఆల్రెడీ బోయపాటి స్టేట్ మెంట్ కూడా ఇచ్చేశాడు. కాని బాలయ్య మాత్రం ఈ విషయంలో కొన్ని కండీషన్స్ పెట్టాడని సమాచారం. బోయపాటితో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలకృష్ణ..లెజెండ్ రేంజ్ లో పొలిటికల్ స్టోరీ కావాలి అని అడిగాడట. ఇప్పటికే కథను రెడీ చేసుకున్న బోయపాటి.. ఇక తప్పక ఆ కథను మార్చే పనిలో ఉన్నాడట. అయితే ఇది ఇప్పట్లో వర్కౌట్ అవుతుందో లేదో అని అనుమానాలు కలుగుతున్నాయి. 

ప్రస్తుతం బోయపాటి ఇస్మార్ట్ హీరో రామ్ తో మూవీ కమిట్ అయ్యాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. అటు బాలయ్య కూడా ప్రస్తుతం మలినేని గోపీచంద్ తో సినిమా చేస్తున్నాడు. ఈసినిమా అయిపోగానే అనిల్ రావిపూడి సినిమా చేయడానిక రెడీ అవుతున్నాడు. ఈలెక్కన ఓ ఏడాది తరువాతే మళ్లీ బోయాపాటి కాంబినేషన్ లో బాలయ్య సినిమా రూపొందే అవకాశం కనిపిస్తోంది. 

బాలయ్య కమిట్ అయిన  రెండు సినిమాల తర్వాత బోయపాటి సినిమా సెట్‌లో అడుగుపెట్టాలనుకుంటున్నాడట. ఆ లోపు బోయపాటి ఓ పవర్‌ఫుల్‌ పొలిటికల్‌ థ్రిల్లర్‌ స్టోరీ రెడీ చేయాల్సి ఉంటుంది.అటు రామ్ మూవీ చూసుకుంటూనే బాలయ్య కోసం కష్టపడబోతున్నాడు బోయపాటి. మరో వైపు సూర్యతో పాటు అల్లు అర్జున్ తో  కూడా బోయపాటి మూవీ ఉంటుంది అన్న మాట వినిపిస్తోంది. మరి ఈ విషయంలో వారు ఏం చేస్తారో చూడాలి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Asha Bhosle Net Worth: ఫ్యామిలీకి వందల కోట్లు వదిలివెళ్లిన లెజెండరీ సింగర్.. ఆశా భోంస్లే ఆస్తులు ఎంతంటే?
Mangli Remuneration: మంగ్లీ ఒక్కో పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా? స్టార్‌ సింగర్స్ ని మించి