
స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బీజీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఏ మాత్రం విరామం లేకుండా ఎప్పుడూ షూటింగ్ లకు హాజరవుతూనే ఉంది. ఈ సందర్భంగా ఏక్కువగా హైదరాబాద్ టు ముంబయి.. ముంబై టు హైదరాబాద్ మరితర ప్రాంతాలకు బుట్టబొమ్మ ఎక్కువగా ఫ్లైట్స్ లోనే జర్నీ చేస్తుంటుంది. అయితే ముంబయి నుంచి బయల్దేరిన ఫ్లైట్ లో తనతో ఓ ఉద్యోగి చాలా రూడ్ గా ప్రవర్తించాడని మండిపడింది. అతని ప్రవర్తన చాలా దారుణంగా ఉందని తెలుపుతూ తాజాగా ట్వీటర్ వేదికన ఫైర్ అయ్యింది.
ట్వీట్ లో.. ‘ఇండిగో 6ఈ ఉద్యోగి ఎంత రూడ్ గా ఉన్నాడో.. చాలా బాధగా ఉంది. ముంబయి నుండి బయలుదేరిన మా విమానంలో విపుల్ నకాషే అనే సిబ్బంది ఈరోజు మాతో ప్రవర్తించిన తీరు చాలా బాధగా ఉంది. ఎటువంటి కారణం లేకుండా మాతో పూర్తిగా అహంకారం, అజ్ఞానం మరియు బెదిరింపు టోన్ ఉపయోగించారు. సాధారణంగా నేను ఈ సమస్యల గురించి ట్వీట్ చేయను, కానీ ఇది నిజంగా భయంకరంగా ఉంది.’ అంటూ ఇండిగో ఎయిర్ లైన్ సంస్థ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది.
ఇలాంటి ఘటనలు హీరోయిన్లకు గతంలో జరిగినవి చాలానే ఉన్నాయి. ఎప్పుటికప్పుడూ వాటిని సరిచేస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఎవరిపై కంప్లైట్ ఎరుగని బుట్టబొమ్మ తాజాగా ఇండిగో ఎయిర్ లైన్ స్టాఫ్ మెంబర్ పై బహిరంగంగా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. పూజా హెగ్దే కంప్లైంట్ కు సంస్థ ప్రతినిధులు ఎలా స్పందించారో, ఉద్యోగిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే పూజా ప్రస్తుతం పూరీజగన్నాథ్, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన ‘జేజీఎం’ చిత్రంలో నటిస్తోంది. ఇటీవలె చిత్ర షూటింగ్ ప్రారంభమైంది.