బాగున్నావా అంటూ రాంచరణ్ ని పలకరించిన బాలయ్య.. శర్వానంద్ రిసెప్షన్ లో అరుదైన దృశ్యం, వైరల్

Published : Jun 10, 2023, 12:49 PM IST
బాగున్నావా అంటూ రాంచరణ్ ని పలకరించిన బాలయ్య.. శర్వానంద్ రిసెప్షన్ లో అరుదైన దృశ్యం, వైరల్

సారాంశం

టాలీవుడ్ హీరో శర్వానంద్ వెడ్డింగ్ రిసెప్షన్ శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. వెడ్డింగ్ రిసెప్షన్ లో టాలీవుడ్ తారలంతా మెరిశారు.

టాలీవుడ్ హీరో శర్వానంద్ వెడ్డింగ్ రిసెప్షన్ శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న శర్వానంద్ ఇటీవల జైపూర్ లో జరిగిన వివాహ వేడుకలో రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. మూడుముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటయ్యారు.  శర్వానంద్ పెళ్ళికి టాలీవుడ్ నుంచి కొందరు ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరై ఆశీర్వదించారు. శర్వా బెస్ట్ ఫ్రెండ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా పెళ్లి వేడుకలో సందడి చేసిన సంగతి తెలిసిందే. 

 అయితే శుక్రవారం జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ లో టాలీవుడ్ తారలంతా మెరిశారు. చాలా మంది హీరోలు సతీసమేతంగా హాజరయ్యారు. రాజకీయ ప్రముఖులు కూడా శర్వా వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరు కావడం విశేషం. శర్వానంద్ ఎంగేజ్మెంట్, పెళ్లి, రిసెప్షన్ ఇలా ప్రతి అంశంలో అతడి బెస్ట్ ఫ్రెండ్ రాంచరణ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాడు. 

రాంచరణ్ ఉపాసనతో కలసి ఈ వేడుకకి హాజరయ్యారు. ఉపాసన నిండు గర్భిణి కావడంతో ఆమెని జాగ్రత్తగా చేయి పట్టుకుని చరణ్ నడిపించుకుని వస్తున్న దృశ్యాలు ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే శర్వా వెడ్డింగ్ రిసెప్షన్ లో రాంచరణ్, నందమూరి బాలకృష్ణ ఒకరికొకరు ఎదురుపడడం హైలైట్ అని చెప్పొచ్చు. 

బాలయ్య ఎదురుపడగానే రాంచరణ్ హలొ సర్ అంటూ పలకరించాడు. వెంటనే బాలయ్య చరణ్ భుజం తడుతూ బావున్నావా అని అడిగాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కొన్ని రోజుల క్రితం స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో బాలయ్య రాంచరణ్ కి వేదికపై ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. అభిమానుల్లో దీని గురించి పెద్ద చర్చే జరిగింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ అనుకోకుండా కలుసుకున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ileana: ప్రభాస్‌, మహేష్‌, తారక్‌, రవితేజ గురించి ఇలియానా ఒక్క మాటలో
Bharani: తన ఒరిజినాలిటీ బయటపెట్టిన భరణి.. మెగా బ్రదర్‌ నాగబాబు స్ట్రాటజీ పనిచేస్తుందా?