భగవంత్ కేసరి.. ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది, బాలయ్య బర్త్ డే గిఫ్ట్ గా హై ఓల్టేజ్ మాస్ టీజర్

By Asianet NewsFirst Published Jun 10, 2023, 11:15 AM IST
Highlights

వీర సింహారెడ్డి గర్జన తర్వాత బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భగవంత్ కేసరి'. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తొలిసారి బాలయ్యని డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఇది.

వీర సింహారెడ్డి గర్జన తర్వాత బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భగవంత్ కేసరి'. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తొలిసారి బాలయ్యని డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఇది. ప్రస్తుతం టాలీవుడ్ లో తెలంగాణ యాస ప్రభావం బలంగా ఉంది. తొలిసారి బాలయ్య చేత అనిల్ రావిపూడి తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ చెప్పేస్తున్నాడు. 

నేడు బాలకృష్ణ 63వ పుట్టినరోజు సందర్భంగా భగవంత్ కేసరి చిత్ర యూనిట్ హై ఓల్టేజ్ మాస్ టీజర్ ని రిలీజ్ చేసింది. బాలయ్య గెటప్, బాడీ లాంగ్వేజ్ ఈ చిత్రంలో విభిన్నంగా ఉన్నాయి. చూడగానే టీజర్ ఎక్కేయడం ఖాయం. సినిమాపై ఈ టీజర్ తోనే సాలిడ్ బజ్ మొదలవుతుంది. 

బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ మూవీలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో మెరుస్తోంది. 'రాజు ఆని ఎనకున్న వందల మంది మందని చూయిస్తడు.. మొండోడు ఆనికున్న ఒకేఒక్క గుండెని చూయిస్తడు' అంటూ బాలయ్య చెబుతున్న డైలాగ్ అదిరిపోయింది. 

బాలయ్య తనదైన శైలిలో విలన్స్ కి ధమ్కీ ఇవ్వడం, వారిపై ఆయుధం తో విరుచుకుపడడం లాంటి యాక్షన్ మూమెంట్స్ టీజర్ లో మెండుగా ఉన్నాయ్. చివర్లో నేలకొండ భగవంత్ కేసరి.. ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది అంటూ బాలయ్య రీసౌండ్ వచ్చేలా చెబుతున్న ఎలివేషన్ డైలాగ్ అదుర్స్. ఇక తమన్ ఎప్పటిలాగే బిజియంతో టీజర్ వాల్యూ పెంచేశాడు. మొత్తంగా భగవంత్ కేసరి చిత్రంతో బాలయ్య ఫ్యాన్స్ తో పాటు, ఆడియన్స్ అందరికి అదిరిపోయే ట్రీట్ గ్యారెంటీ అని అనిల్ రావిపూడి టీజర్ తో తేల్చేశారు. 

దసరా కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సాహు గారపాటి , హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. 

click me!