
హీరోలు ఎంత మంచిగా ఉన్నా..ఫ్యాన్స్ మంద్య వార్ మాత్ర కామన్. అలాగే నందమూరి , మెగా ప్యాన్స్ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉంటాయి. ఈక్రమంలో మెగా ..నందమూరి హీరోలు కలిసి మరో మల్టీ స్టారర్ మూవ చేస్తై.. అది కూడా బాలయ్య, పవన్ కల్యాణ్ కలసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది. ఈటాపిక్ అన్ స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ లో వచ్చింది. పవర్ స్టార్ తో.. బాలయ్య చేసిన సెకండ్ ఎపిసోర్ రాత్రి రిలీజ్ అవ్వగా.. బాలయ్య ఈ ఎపిసోడ్ ను అద్భుతంగా హోస్ట్ చేశారు. ఈక్రమంలో వీరి మధ్య మల్టీ స్టారర్ డిస్కర్షన్ వచ్చింది.
ఈ ఎపిసోడ్ లో రకరకాల అంశాలు చర్చకు వచ్చాయి. అందులో ముఖ్యంగా పొలిటికల్ అంశాలు వాడీ వేడిగా చర్చ జరిగిన తరువాత.. మళ్ళీ కాసేపు సరదాగా ముచ్చట్టు చెప్పుకున్నారు బాలయ్య పవన్. ఈక్రమంలో పవన్ తో ఓ గేమ్ కూడా ఆడించారు బాలయ్య. ఈసందర్భంగా పవన్ ని కొన్ని ప్రశ్నలు అడుగుతానని పవన్ వాటికి సమాధానాలు రాయాలని, అంతకుముందే అక్కడున్న అభిమానులు వాటికి సమాధానం చెప్పాలని అన్నారు బాలయ్య. దాంత అంతా సై అంటే సై అన్నారు.
ఈక్రమంలోనేవరుసగా ప్రశ్నలు అడిగారు బాలకృష్ణ.. అందులో .. పవన్ హిందీ సినిమా చేయాలి అని అంటే.. దానికి ఫ్యాన్స్ ఎస్అని సమాధానం చెప్పగా.. పవన్ మాత్రం నో చెప్పాడు. పవన్ యాక్షన్ సినిమాలు తీయాలి అంటే ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఎస్ చెప్పారు. వైఫ్ కి పవన్ ఎప్పుడైనా సారీ చెప్తారా అంటే ఫ్యాన్స్ నో చెప్పగా పవన్.. గొడవలు రాకుండా చూసుకుంటాం, సారీలు చెప్పే అవసరం రాకుండా అని రాసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఇక ఈక్రమంలో బాలయ్య పవన్ ముందు ఓ ప్రపోజల్ పెట్టాడు. బాలకృష్ణ పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ చేద్దాం అని అనగానే ఫ్యాన్స్ అరుపులతో హెోరెత్తిచారు. బలయ్య ప్రపోజల్ కు పవర్ స్టార్ వెంటనే ఓకే అనేశారు. అభిమానులు కూడా చేయాలి అని అన్నారు.డైరెక్టర్ క్రిష్ కథ కూడా రెడీగా ఉంది చెప్పమంటారా అని అనడంతో.. ఉత్కంఠభరితంగా అనిపించింది ఆసీన్.
అటు నందమూరి అభిమానులు.. ఇటు మెగా అభిమానులు దిల్ ఖుష్ అయ్యేలా .. అన్ స్టాపబుల్ సీజన్ 2లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ రెండో ఎపిసోడ్ రిలీజ్ అయ్యింది. ఎప్పటిలాగానే బాలయ్య తన ఎనర్జీ లెవల్స్ తో పవన్ కు పోటీ ఇస్తూ.. ఎపిసోడ్ ను అద్భుతంగా హోస్ట్ చేశారు. దానితో పాటు సరదా సరదా సంబాషణలు.. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ తో పాటు.. పవర్ స్టార్ గురించి కొత్త కొత్త విషయాలు కూడా చర్చకు వచ్చాయి.