ఆయనతో జాగ్రత్త అంటూ.. నాగశౌర్యకి రానా వార్నింగ్‌..

Published : Jul 24, 2021, 05:10 PM IST
ఆయనతో జాగ్రత్త అంటూ.. నాగశౌర్యకి రానా వార్నింగ్‌..

సారాంశం

యంగ్‌ హీరో నాగశౌర్యకి వార్నింగ్‌ ఇచ్చారు భళ్లాలదేవ రానా. అమాయకంగా కనిపించే వ్యక్తులతో జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

యంగ్‌ హీరో నాగశౌర్యకి రానా వార్నింగ్‌ ఇచ్చాడు. ఆయనతో కాస్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈజీగా నమ్మకూడదని చెప్పారు. మరి ఇంతకి వీరి మధ్య ఏం జరిగింది. నాగశౌర్యకి రానా ఎందుకు వార్నింగ్‌ ఇవ్వాల్సి వచ్చిందనేది చూస్తే.. ఇటీవల తాను నటిస్తున్న చిత్రానికి సంబంధించిన స్టిల్‌ని పంచుకున్నాడు నాగశౌర్య. బ్రహ్మాజీతో దిగిన ఫోటో ఇది. ఇద్దరూ నామాలు పెట్టుకుని ఉన్నారు. ఈ సందర్భంగా నాగశౌర్య ట్వీట్‌ చేస్తూ `నా తమ్ముడు బ్రహ్మాజీ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాడు. మీ అందరి సపోర్ట్‌ తనకి ఉండాలి. దయచేసి యంగ్‌ టాలెంట్‌ని ప్రోత్సహించండి` అని సరదాగా ట్వీట్‌ చేశాడు.

ఇందులో బ్రహ్మాజీ చాలా అమాయకంగా కనిపిస్తున్నాడు. అదే సమయంలో ఆయన లుక్‌లో తేడా ఉందట. ఈ విషయాన్ని రానా ట్వీట్‌ చేశాడు. నాగశౌర్య ట్వీట్‌ని రీ ట్వీట్‌ చేస్తూ, `వామ్మో ఇదేంటి గురు! నాగశౌర్య.. దయచేసి నువ్వు జాగ్రత్తగా ఉండు. బ్రహ్మాజీ చూపు నాకేంటో తేడాగా కనిపిస్తోంది. నువ్వు ఏమంటావ్‌?` అని రిప్లై ఇచ్చాడు. దీనిపై శౌర్య కూడా ప్రతిస్పందించారు. `నువ్వు చెప్పింది కరెక్ట్‌ భయ్యా. నాకూ ఏదో తేడాగా అనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండాల్సిందే` అని కామెంట్‌ చేయడం ఆకట్టుకుంటుంది.

ఇలా వీరి మధ్య సరదాగా సంభాషణ సాగింది. ఇక, సినిమా విషయానికి వస్తే, లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అనీష్‌ కృష్ణా దర్శకత్వం వహిస్తున్నారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో షీర్లే సేతియా కథానాయిక.  సీనియర్‌ నటి రాధిక ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలోని ప్రధాన తారగణంపై కీలక సన్నివేశాలతో పాటుగా, ప్రేక్షకులు అమితంగా ఎంటర్‌టైన్‌ చేసే హీలేరియస్‌ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు చిత్రయూనిట్‌.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి