Balakrishna Allu Arjun Multi Starar: బాలయ్యతో బన్నీ మల్టీ స్టారర్.. ?ఫ్యాన్స్ కు పండగే..!

By Mahesh Jujjuri  |  First Published Jan 13, 2022, 12:12 PM IST

బాలయ్య(Balakrishna) ఆహా కి అన్ స్టాపబుల్ చేయడం, ఆ తరువాత బాలయ్య అఖండ ఈవెంట్ కి బన్నీ చీఫ్ గెస్ట్ గా రావడం... ఇదే సమయంలో మల్టీ స్టారర్ల చర్చ జోరుగా ఊపందుకోవడం అన్ని వెరసి బన్నీ బాలయ్య కాంబో లో ఒక మూవీ ని తెర మీద చూడొచ్చా అనే ఒక ఆశ సినీ ప్రేమికుల్లో మొదలయ్యింది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం ఫ్యాన్స్ ఆశగా ఎరురు చూస్తున్నారు.


బాలయ్య(Balakrishna) ఆహా కి అన్ స్టాపబుల్ చేయడం, ఆ తరువాత బాలయ్య అఖండ ఈవెంట్ కి బన్నీ చీఫ్ గెస్ట్ గా రావడం... ఇదే సమయంలో మల్టీ స్టారర్ల చర్చ జోరుగా ఊపందుకోవడం అన్ని వెరసి బన్నీ బాలయ్య కాంబో లో ఒక మూవీ ని తెర మీద చూడొచ్చా అనే ఒక ఆశ సినీ ప్రేమికుల్లో మొదలయ్యింది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం ఫ్యాన్స్ ఆశగా ఎరురు చూస్తున్నారు.

 

Latest Videos

మల్టీ స్టారర్ మూవీస్ మన టాలీవుడ్ ఇండస్ట్రీ కి కొత్త కాదు గతంలో.... ... పాతవి ఎన్టీఆర్, నాగేశ్వర్ రావు, ఇలా శోభన్ బాబు రాజశేఖర్ నింపేయండి ఆ తరువాత కొంచం బ్రేక్ వచ్చింది. ఇప్పుడు తాజాగా RRR రూపంలో మల్టీ స్టారర్లకు పూర్తి స్థాయి క్రేజ్ ని తీసుకొచ్చారు. అదే ఊపుతో మరికొన్ని మల్టీ స్టారర్ మూవీస్ పై టాలీవుడ్ లో చర్చ గట్టిగా నడుస్తుంది. అందలో బాలయ్య – బన్నీ మల్టీ స్టారర్ మూవ కూడా ఉండే అవకాశం ఉంది.

 

ఈ పరిస్థితుల నడుమనే పుష్ప సినిమా మంచి విజయాన్ని అందుకొని అల్లు అర్జున్(Allu Arjun) పెర్ఫార్మన్స్ కి నూటికి నూరు మార్కులు వేస్తున్నారు అభిమానులు. కెరీర్ లో కం బ్యాక్ హిట్ కోసం చూస్తున్న బాలయ్య(Balakrishna)  అఖండ ద్వారా ఇండస్ట్రీ ని షేక్ చేసే రికార్డులను ఈ కరోనా, ఏపీలో టికెట్ రేట్ల నడుమ కూడా సాధించారు..! ఈ ఇద్దరు స్టార్లు సూపర్ సక్సెస్ ను సాధించారు. అది కూడా ఈ పాండమిక్ టైమ్ లో. అందులోను అఖండాకు బన్నీ గెస్ట్ గా రావడం.. బాలయ్యతో ఈ మధ్య ఎక్కువగా సన్నిహితంగా ఉండటంతో మల్టీ స్టారర్ ఊహాగానాలు ఊపు అందుకున్నాయి.

ఈ పరిస్థితుల్లో బాలయ్య(Balakrishna), బన్నీ(Allu Arjun) సినిమా పై జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. నిన్న అఖండ థాంక్యూ మీట్ లో ఇదే ప్రశ్నని బోయపాటికి సంధించారు. బాలయ్య, బన్నీ, బోయపాటిల కాంబినేషన్ లో సినిమా వస్తుందా అని ప్రశ్నించారు. ఆయన రాదూ అని మాత్రం చెప్పలేదు. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అంటూ భవిష్యత్తులో ఈ సినిమా దిశగా ఆలోచించే అవకాశాలున్నట్టు చెప్పకనే చెప్పారు.

ఆమధ్య అఖండా సక్సెస్ జర్నీలో కూడా బాలకృష్ణ (Balakrishna)  మాట్లాడుతూ.. మల్టీ స్టారర్ చేయడానికి నేను రెడి అన్నారు. మంచి కథతో ఎవరైనా వస్తే.. నేను రెడీగా ఉన్నాను అన్నారు. బాలయ్య ఈ హింట్ ఇవ్వడంతో చాలా మంది దర్శకులు మల్టీ స్టారర్ కథల వేటలో ఉన్నారట. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ స్టార్ బాలయ్య..మెగా ఫ్యామిలీ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కలిస్తే.. ఆక్రేజ్ మామూలుగా ఉండదు. రచ్చ రచ్చే అంటున్నారు. ఇఫ్పటికే నందమూరి,మెగా ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్(RRR) ఏ రేంజ్ లో బజ్  ను క్రియేట్ చేసిందో తెలియంది కాదు.

Also Read : అల్లు అర్జున్‌ తొందరపడ్డారు.. `అఖండ` దెబ్బ కొట్టాడు.. బాలయ్య ప్లాన్‌ మైండ్‌ బ్లోయింగ్‌

వాస్తవంగా మంచి కథతో ఇద్దరు పెద్ద హీరోలు ఒకే స్క్రీన్ మీద కనబడితే అది కలెక్షన్ల పరంగా కూడా మంచి లాభాలను ఆర్జించి పెడుతుంది. సక్సెస్ అవడానికి అవకాశాలు ఎక్కువ. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా ఇప్పటికిప్పుడు సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనబడకున్నప్పటికీ... భవిష్యత్తులో మాత్రం ఇదొక క్రేజీ కాంబినేషన్ అని మాత్రం చెప్పక తప్పదు. బాలయ్య-బన్నీ స్క్రీన్ మీద కనిపిస్తే.. బాక్సాఫీస్ లు బద్దలయ్యే కలెక్షన్స్ ఖాయం అంటున్నారు సినీ జనం.

Also Read : ఒక్క హిట్టు కోసం ఎదురు చూస్తున్న కుర్ర హీరోలు.. ఈ ఏడాదైనా కలిసొస్తుందా..?

click me!