Akhanda Title Song: అబ్బురపరిచే విజువల్స్.. బాలయ్యని చూస్తూ, లిరిక్స్ వింటూ మరో కొత్త లోకంలోకి..

Published : Nov 08, 2021, 01:42 PM IST
Akhanda Title Song: అబ్బురపరిచే విజువల్స్.. బాలయ్యని చూస్తూ, లిరిక్స్ వింటూ మరో కొత్త లోకంలోకి..

సారాంశం

నందమూరి బాలకృష్ణ జోష్ ప్రస్తుతం మామూలుగా లేదు. బాలయ్య ప్రస్తుతం అఖండ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే ఆహా ఓటిటిలో 'అన్ స్టాపబుల్' అనే షో కూడా చేస్తున్నాడు.

నందమూరి బాలకృష్ణ జోష్ ప్రస్తుతం మామూలుగా లేదు. బాలయ్య ప్రస్తుతం అఖండ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే ఆహా ఓటిటిలో 'అన్ స్టాపబుల్' అనే షో కూడా చేస్తున్నాడు. అఖండ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. దీనితో దర్శకుడు బోయపాటి శ్రీను ప్రచార కార్యక్రమాల జోరు పెంచుతున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ విడుదలయింది. 

Akhanda చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీత దర్శకుడు. ఇటీవల ఈ టైటిల్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేయగా తప్పకుండా పవర్ ఫుల్ సాంగ్ అవుతుందని అంతా భావించారు. అభిమానుల అంచనాలకు తగ్గట్లుగానే పూర్తి పాట ఉంది. తమన్ సంగీతం, అనంత శ్రీరామ్ లిరిక్స్ మరో కొత్త లోకంలోకి తీసుకువెళ్లేలా ఉన్నాయి. 

లిరికల్ వీడియోలో చూపించిన విజువల్, అఘోరి పాత్రలో Balakrishna గెటప్ అబ్బురపరిచే విధంగా ఉన్నాయి. త్రిశూలం చేతబట్టిన బాలయ్య ఉగ్ర ఉగ్రరూపంతో శత్రువులపై విరుచుకు పడుతున్నారు. అనంత్ శ్రీరామ్ బాలయ్య అఘోరి పాత్రని వర్ణిస్తూ లిరిక్స్ లో శక్తివంతమైన పదాలు వాడారు. 

Also Read: 'గద్దలకొండ గణేష్' బ్యూటీ రెడ్ హాట్ ఫోజులు.. మెస్మరైజ్ చేసే సౌందర్యం

బోయపాటి బాలయ్యకు సన్నివేశం వివరిస్తూ విజువల్స్ లో కనిపించారు. తప్పకుండా థియేటర్స్ లో ఈ సాంగ్ బాలయ్య అభిమానులకు విజువల్ ట్రీట్ అవుతుంది. అసలు ఈ చిత్రంలో బాలయ్య అఘోరి పాత్ర వెనుక ఉన్న కథ ఏంటి అనే ఉత్కంఠ రోజు రోజుకు పెరిగిపోతోంది. 

Also Read: దీపావళి వేడుకలలో ఏంజెల్ లా మెరిసిన అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి, ఆ గ్లామర్ ముందు హీరోయిన్స్ కూడా దిగదుడుపే

బాలయ్య, బోయపాటి కాంబినేషన్ అంటే అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు ఎంత పెద్ద విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. దీనితో అఖండపై బాలయ్య అభిమానులు చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఇక బోయపాటి కూడా వినయ విధేయ రామ డిజాస్టర్ నుంచి బౌన్స్ బ్యాక్ కావాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. బాలయ్య సరసన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే