నందమూరి బాలకృష్ణ నటిస్తున్న `అఖండ` సినిమా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. అదిరిపోయే గిఫ్ట్ ని ఇచ్చేందుకు బాలయ్య టీమ్ రెడీ అవుతుంది. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడమే రాబోతుంది `అఖండ` టీమ్.
బాలకృష్ణ .. ఈ శనివారం తన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. ఓ వైపు తన కొత్త సినిమాని ఈ రోజు(నవంబర్ 13) ఉదయం ప్రారంభించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న `NBK107`సినిమా ప్రారంభోత్సవం జరిగింది. అగ్ర దర్శకులు ఇందులో పాల్గొన్నారు. మరోవైపు ఈ సాయంత్రం మరో గుడ్‌న్యూస్ చెప్పాడు బాలకృష్ణ. తాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న `అఖండ`(Akhanda) చిత్రం ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.
Akhanda చిత్రం నుంచి ఇప్పటికే టీజర్ విడుదలై ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను పెంచాయి. ఫ్యాన్స్ లో పునకాలు క్రియేట్ చేసింది. ఇప్పుడు అసలైన పూనకాలకు తెరలేపింది Balakrishna టీమ్. Akhanda Trailerని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. రేపు(ఆదివారం) సాయంత్రం ఏడుగంటలకు ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్టు తెలియజేస్తూ పోస్టర్‌ని పంచుకున్నారు. ఇందులో NBK అఘోర లుక్‌లో శివతాండవం చేస్తున్నారు. ఆయన లుక్ మైండ్ బ్లోయింగ్ గా ఉండటం విశేషం. ఓ వైపు గుడ్‌న్యూస్‌తో అభిమానులు ఆనందంలో మునిగితేలుతుంటే, మరోవైపు ఈ పోస్టర్‌తో బాలయ్య లుక్ సైతం గూస్‌బమ్స్ తెప్పిస్తుండటం విశేషం.
బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రం `అఖండ`. గతంలో `సింహా`, `లెజెండ్` వంటి చిత్రాలు రూపొంది బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. బాలయ్య స్టయిల్ మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్లుగా ఈ సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. దీంతో ఇప్పుడు `అఖండ` చిత్రంపై అభిమానుల్లో, సాధారణ ఆడియెన్స్ లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు ఇందులో రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు బాలకృష్ణ. అఘోరగా, ఊరు పెద్దగా కనువిందు చేయబోతున్నారు. మరి ఫస్ట్ టైమ్ అఘోరగా కనిపిస్తున్న నేపథ్యంలో మరింత ఆసక్తి నెలకొంది.
also read: హాట్ న్యూస్: ‘అఖండ’రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీ అవుతుంది. డిసెంబర్ 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తుందట. డిసెంబర్ రెండో వారం నుంచి భారీ సినిమాలు విడుదల కానున్నాయి. ఫిబ్రవరి దాకా సినిమా జాతర కొనసాగబోతుంది. దీంతో డిసెంబర్ ఒకటో తేదీని రిలీజ్ చేయాలనుకుంటున్నారట. దీనిపై రేపు ట్రైలర్‌లో క్లారిటీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇక సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యాజైశ్వాల్ కథానాయికగా నటిస్తుంది. పూర్ణ కీలక పాత్ర పోషిస్తుంది. శ్రీకాంత్ ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
also read: NBK 107: క్రాక్ దర్శకుడితో బాలయ్య మొదలెట్టేశాడు!