BALAKRISHNA: ఆదిత్య 369 సీక్వెల్ మోక్షజ్ఞ కాదు.. బాలయ్యే చేస్తున్నారా..?

బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ఆదిత్య 369. ఈమూవీ సీక్వెల్ కు సన్నాహాలు జరగుతున్నాయి. మోక్షజ్ఞ హీరోగా సీక్వెల్ మూవీ ఉంటుందన్నారు బాలయ్య. మరి ఇప్పుడు బాలయ్యే స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఈమూవీని బాలకృష్ణ హీరోగా చేస్తున్నారా..? మోక్షజ్ఞ హీరోగా చేస్తున్నారా..?


బాలకృష్ణ(Balakrishna) వారసుడిగా మోక్షజ్ఞ(Mokshagna,  ) ఎంట్రీ కోసం నందమూరి (Nandamuri) ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. అయితే త్వరలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని.. అది కూడా తన సూపర్ హిట్ సినిమా ఆదిత్య 369(Adithya 369) కు సీక్వెల్ కథతో.. తన వారసుడి ఎంట్రీ ఉంటుందంటూ... గతంలో బాలకృష్ణ ప్రకటించారు. కాని ఈ మూవీ ఇప్పుడు బాలయ్య బాబే చేసే అవకాశం కనిపిస్తుంది.

 

Latest Videos

బాలకృష్ణ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'ఆదిత్య 369' కూడా ఒకటి ఈసినిమాతో ఆయన ఇమేజ్  ఓ మెట్టు ఎక్కువే  పెరిగింది. సింగీతం శ్రీనివాసరావు(Srinivasa Rao) దర్శకత్వంలో 1991లో వచ్చిన Adithya 369 మూవీ సూపర్ సక్సెస్ సాధించింది. బాలయ్య డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమా... టైమ్ మెషిన్ బ్యాక్ డ్రాప్ లో .. సైస్స్ ను కూడా సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పింది. ఈ సినిమా ఇప్పటికీ కళ్ళార్పకుండా చూసే ఫాన్స్ ఉన్నారు.


అలాంటిది ఈ సినిమాకి సీక్వెల్ రానుందనే టాక్ చాలా రోజులుగా  వినిపిస్తోంది. ఈ సినిమా ద్వారానే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనే ప్రచారం గట్టిగానే జరిగింది. అంతే కాదు స్వయంగా ఈసినిమాను బాలయ్యే డైరెక్ట్ చేస్తాన్నన్నారు కూడా. అయితే రీసెంట్ సమాచారం ప్రకారం.. ఈ సీక్వెల్ కి స్క్రిప్ట్ పూర్తయినట్టు తెలుస్తుంది. అప్పటి టైమ్ మిషన్ కు ఇప్పటి టెక్నాలజీని జోడించి.. భూత .. భవిష్యత్తు కాలాల్లో ప్రయాణించే ఈ టైమ్ మెషిన్ స్టోరీ రెడీ అయ్యిందట.  

Also Read :  AKHANDA- ACHARYA : అఖండ ఎఫెక్ట్... చిరు ఆచార్య రీషూట్..?

ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటీ అంటే.. ఈ సినిమాను బాలకృష్ణ డైరెక్ట్ చేయడం లేదని లేటెస్ట్ ఇన్ ఫర్మేషన్,  ఈ సీక్వెల్ మూనీని మళ్లీ సింగీతం శ్రీనివాసరావుగారే డైరెక్ట్ చేస్తారంటూ టాక్ వినిపిస్తుంది. లేదంటే ఆయన దర్శకత్వ పర్యావేక్షణలో వేరే డైరెక్టర్ ఈ ప్రాజక్ట్ చేపడతారు అని సమాచారం. ఈ సినిమాలో దాదాపుగా బాలయ్యే హీరోగా నటిస్తాడంటున్నారు. మరి తన వారసుడికోసం ఏ ప్లాన్ చేశాడో తెలియదు. అయితే సింగీతం శ్రీనివాస్ రావ్ ప్రస్తుతం ప్రభాస్ – నాగ్ అశ్వీన్ ప్రాజెక్ట్ కే ను పర్వావేక్షిస్తున్నారు. ఈసినిమా తరువాతే ఆదిత్య 369 మూవీ రీమేక్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.

click me!