
బాలయ్య 107వ సినిమాగా వచ్చిన 'వీరసింహారెడ్డి' సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా, నిన్నటితో 50 రోజులను పూర్తిచేసుకుంది. ఆ తరువాత సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ షూటింగ్ అయితే స్టార్ట్ అయ్యిన ఈ చిత్రం జెట్ స్పీడ్ లో కంప్లీట్ అవ్వటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో చిత్రం రిలీజ్ ఎప్పుడు అనేది హాట్ టాపిక్ గా మారింది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ భారీ సినిమా ఈ ఏడాది దసరా కు వచ్చే అవకాసం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో రావడమేకాదు.. ఓ ఆరు భాషల్లో విడుదలకానుందని సమాచారం. ఇక ఉగాదికి ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ కూడా రివీల్ చేయనుందట టీమ్. . ఈ సినిమాలో బాలయ్య పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. అయితే ఎంత పవర్ ఫుల్ గా ఉన్నా.. మరోవైపు ఆ పాత్ర తాలూకు ప్రవర్తన, మాటలు వెరీ ఫన్నీగా ఉంటాయట. ముఖ్యంగా ఈ సినిమాలో తండ్రి కూతురు మధ్య మంచి ఎమోషనల్ ట్రాక్ ఉంటుందట. ఇదే ఈ సినిమాకు ఆయువు పట్టు అని అంటున్నారు. ఈ సినిమాలో శ్రీలీల, బాలయ్య కూతురుగా చేస్తోంది.
ఇక ఈ సినిమాలో శ్రీముఖి ఒక ముఖ్యమైన పాత్రను పోషించనుందనేది టాక్. బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తుండగా, ఆమెకి ఫ్రెండ్ పాత్రలో శ్రీముఖి కనిపించనుందని అంటున్నారు. మొదటి నుంచి చివరివరకూ ఈ పాత్ర తెరపై కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.