ఎంపీ బండి సంజయ్ ఇంట్లో ‘బలగం’ సీన్ రిపీట్.. ఏం జరిగింది?

By Asianet News  |  First Published Apr 7, 2023, 6:54 PM IST

ప్రస్తుతం ‘బలగం’పేరు ఊరూరా వినిపిస్తోంది. ప్రేక్షకులకు  బాగా కనెక్ట్ అయ్యింది. ఈ క్రమంలో చిత్రంలోని ఓ సన్నివేశామే ఎంపీ బండి సంజయ్ ఇంట్లోనూ తాజాగా రిపీట్ అయ్యింది. ప్రస్తుతం ఆ న్యూస్ ఆసక్తికరంగా మారింది.
 


కమెడియన్ గా తెలుగు ప్రేక్షకులను అలరించిన వేణు ఎల్దండి సైలెంట్ గా ‘బలగం’ Balagam తో దర్శకుడి అవతారం ఎత్తాడు. తొలిచిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తెలంగాణ  పల్లెల్లోని అసలైన జీవన విధానాన్ని, కల్చర్ ను చూపించే ప్రయత్నం చేసి సఫలమయ్యారు. ఫలితంగా ప్రస్తుతం ఊరూరా ‘బలగం’ మాటే వినిపిస్తోంది. ప్రతి పల్లెలో ప్రొజెక్టర్లతో సినిమాను ప్రదర్శిస్తున్నారు. చిత్రాన్ని చూసిన ఊరి జనం కంటతడి పెట్టుకుంటున్నారు. భావోద్వేగానికి లోనవుతున్నారు. 

మానవ సంబంధాలను, కుటుంబంలోని అనుబంధాలను చెప్పిన ఈ సినిమా తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఏదోలా కనెక్ట్ అవుతూనే ఉంది. సినిమా చూసి ఏకంగా విడిపోయిన కుటుంబాలు కూడా కలిసిపోతుండటం ప్రభంజనంగా మారింది. ఇదిలా ఉంటే.. ‘బలగం’ చిత్రంలోని ఓ కీలకమైన సీన్ బీజేపీ రాష్ట్ర అధ్యకుడు, కరీంనగర్ ఎంపీ బండి సజయ్ కుమార్ (Bandi Sanjay) కుమార్ ఇంట్లో రిపీట్ అయ్యింది. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించడంతో ఆసక్తికరంగా మారింది.

Latest Videos

అయితే, బలగం చిత్రంలో కొమురయ్య మరణానంతరం పిట్టకు ఆహారం పెట్టే కార్యక్రమం జరుతుంది. ఆ సమయంలో కొమురయ్య కుటుంబం కూడి లేదనే కారణంతో పిట్ట ఆహారం ముట్టదు. ఇదే సీన్ బండి  సంజయ్ ఇంట్లోనూ రిపీట్ అయ్యిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయన టెన్త్ పేపర్ లీక్ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన్ని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఈక్రమంలోనే సంజయ్ అత్తమ్మ మరణించారు. ఆమె అంత్యక్రియలు కూడా ముగిశాయి. తదుపరి కార్యక్రామాలను కూడా నిర్వహించారు. దశదిన కార్యక్రమాన్ని సంజయ్ చేతుల మీదుగా జరిపించారు.

అయితే, అల్లుడైన సంజయ్ తన అత్తమ్మ మరణానంతరం జరిపించాల్సిన  కార్యక్రమాల్లో లేకపోవడంతో నైవేద్యాన్ని పక్షి ముట్టలేదని  కుటుంబీకులు వెల్లడించారు. తనను కన్న కొడుకులా చూసుకుందని చెప్పడం గమనార్హం. ఐదోరోజు సంజయ్ కు వీడియో కాల్ చేసి మాట్లాడక వచ్చి తిన్నదని చెప్పారు. ఇక అటు ‘బలగం’లో నటించిన రచ్చ రవి జీవితంలోనూ తన చెల్లెలు విషయంలో బలగం సీన్ రిలీట్ అయ్యింది. ఏడేండ్లుగా తనకు దూరంగా ఉందని, రాఖీ కూడా తానే ఇంటికి వెళ్లి కట్టించుకుంటున్నాని, ఇకనైనా కనుకరించాలని ఓ ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకున్నారు.  ఇలా అడుగడుగునా బలగం సీన్సే కనిపిస్తున్నాయి.  

చిత్రం ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా.. అంతర్జాతీయంగానూ గుర్తింపు దక్కించుకుంది. ఆయా విభాగాల్లో అవార్డులను అందుకుంటోంది. చిత్రంతో ప్రియదర్శి - కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. మరుళీధర్ గౌడ్, రచ్చ రవి కీలక పాత్రలు పోషించారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ తన సొంత బ్యానర్ లో నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మార్చి 3న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.  

click me!