గ్రూప్‌ 4 ఎగ్జామ్‌లో `బలగం` సినిమాపై ప్రశ్న.. ఆశ్చర్యంలో అభ్యర్థులు..

Published : Jul 01, 2023, 02:13 PM IST
గ్రూప్‌ 4 ఎగ్జామ్‌లో `బలగం` సినిమాపై ప్రశ్న.. ఆశ్చర్యంలో అభ్యర్థులు..

సారాంశం

తెలంగాణ నేపథ్యంలో వచ్చి సంచలనం సృష్టించిన `బలగం` సినిమాపై  గ్రూప్‌ 4లో ఎగ్జామ్‌లో ప్రశ్న రావడం ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. 

ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన పరీక్షల్లో సినిమాకి సంబంధించిన ప్రశ్నలు తరచూ వస్తుంటాయి. తాజాగా `గ్రూప్‌ 4` ఎగ్జామ్‌లో `బలగం` సినిమాపై ప్రశ్న రావడం విశేషం. అంతా ఆస్కార్‌ సాధించిన `ఆర్‌ఆర్‌ఆర్‌`పై ప్రశ్నలు వస్తాయని భావించారు. కానీ అనూహ్యంగా కమెడియన్‌ వేణు యెల్దండి దర్శకత్వంలో రూపొందిన `బలగం` సినిమాపై ప్రశ్న రావడం ఆశ్చర్యపరుస్తుంది. 

ఇంతకి ప్రశ్న ఏంటంటే.. ``బలగం` చిత్రానికి సంబంధించి క్రింది జతలలో ఏవీ సరిగ్గా జతపరచబడినవి?` అని అడిగారు. దీనికి నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఏ- దర్శకుడు ః వేణు యెల్దండి, బి- నిర్మాతః దిల్‌రాజ్, హన్షితా రెడ్డి, హర్షిత్‌ రెడ్డి, సీ-సంగీత దర్శకుడుః భీమ్స్ సిసిరోలియో, డీ-కొమయ్య పాత్రని పోషించినవారుః అరుసం మధుసూధన్‌  అని ఆప్షన్లు ఇస్తూ కన్‌ ఫ్యూజ్‌ చేసేలా మరో ఆప్షన్లు ఇచ్చారు. నాలుగింటిలో ఎన్ని కరెక్ట్ అనేది ప్రశ్న. ఇందులో ఏ, బీ,సీ కరెక్ట్ ఇచ్చి, డీ తప్పు ఇచ్చాడు. మొత్తానికి అభ్యర్థులను చిన్న కన్‌ఫ్యూజ్‌ చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌ అవుతుంది. 

ఇక కమెడియన్‌ వేణు యెల్దండి దర్శకుడిగా మారి రూపొందించిన `బలగం` చిత్రం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ విజయం సాధించింది. తెలంగాణ పల్లె నేపథ్యంలో, తెలంగాణ పల్లెల్లో సంస్కృతి, సాంప్రదాయాల నేపథ్యంలో రూట్‌ లెవల్‌లోకి వెళ్లి తీసిన చిత్రమిది. పెద్దాయన చనిపోయాక ఇంట్లో జరిగే పరిణామాలు, ఇద్దరు కొడుకులు ఎలా రియాక్ట్ అయ్యారు, అల్లుడు ఎలా స్పందించారు. వారి మధ్య వచ్చే గొడవలేంటి? అనే అంశాలను చాలా సహజంగా, కళ్లకి కట్టినట్టు చూపించారు దర్శకుడు. కుటుంబ అనుబంధాలు, ఎమోషన్స్ ప్రధానంగా దీన్ని తెరకెక్కించారు. అందుకే ఈ సినిమా తెలంగాణ అంతటా బాగా ఆదరణ పొందింది. 

చాలా ఊర్లల్లో ఈ సినిమాని స్వచ్ఛందంగా ప్రదర్శించుకుని చూడటం, అందులో చిన్న చిన్న గొడవలతో విడిపోయిన అన్నాదమ్ములు సినిమా చూసి కలుసుకోవడం వంటి సంఘటనలు చోటు చేసుకోవడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా అనేక అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.  ఇక సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్‌, మురళీధర్‌ గౌడ్‌, సుధాకర్‌రెడ్డి, కోట జయరాం, రూపాలక్ష్మి వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు. కొమురయ్యగా నటించింది సుధాకర్‌ రెడ్డి అనే విషయం తెలిసిందే.ఇప్పుడు గ్రూప్‌ 4 ఎగ్జామ్‌లో వచ్చిన ప్రశ్నలో ఈ పేరునే తప్పుగా ఇచ్చారు.  `బలగం` సినిమాని తన వారసులు హన్షితా రెడ్డి, హర్షిత్ రెడ్డిలతో కలిసి దిల్‌రాజు ఈ సినిమాకి నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. 4 కోట్లతో రూపొందిన సినిమా ముప్పై కోట్లు వసూలు చేసింది.  
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

2025లో ఘోరంగా ఫ్లాపైన 5 భారీ బడ్జెట్‌ సినిమాలు ఏవో తెలుసా?
ర‌జినీకి త‌ల్లిగా, ల‌వ‌ర్‌గా, భార్య‌గా న‌టించిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా