రామ్‌ పోతినేని, బోయపాటి చిత్రం టైటిల్ ఇదే? పవర్ ఫుల్ గా ఉంది

Published : Jul 01, 2023, 12:25 PM IST
 రామ్‌ పోతినేని, బోయపాటి చిత్రం టైటిల్ ఇదే?  పవర్ ఫుల్ గా ఉంది

సారాంశం

రామ్ గత ఏడాది వారియర్ అనే చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో చేశారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

 రవితేజ హీరోగా రూపొందిన భద్ర మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టిన బోయపాటి ఆ తరువాత తులసి , సింహ , దమ్ము  , సరైనోడు , లెజెండ్ , జయ జానకి నాయక , వినయ విధేయ రామ , అఖండ మూవీ లకు దర్శకత్వం వహించి ఇందులో ఎక్కువ మూవీ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న మాస్ దర్శకుడు గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.  ప్రస్తుతం ఈ దర్శకుడు రామ్ పోతినేని హీరో గా రూపొందుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ కాంబినేషన్ పై ఓ రేంజిలో క్రేజ్ క్రియేట్ అయ్యింది.

ఇప్పటి వరకు ఈ మూవీ కి టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ యొక్క షూటింగ్ "బోయపాటి రాపో"  అనే వర్కింగ్ టైటిల్ తో ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇందులో శ్రీ లీల హీరోయిన్. పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తై రిలీజ్ కు రెడీ అయ్యింది.  బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్‌ ఇండియా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి `స్కంథ` అనే టైటిల్ ఫైనల్ చేసినట్లు సమాచారం.

ఈ సినిమా ద్వారా పాన్-ఇండియా ఇమేజ్‌ని, మార్కెట్‌ను ఏర్పరుచుకోవాలని భావిస్తున్నాడు. అయితే అక్టోబర్ 20న దసరా ఫెస్టివల్‌ కు సినిమాను విడుదల చేయనున్నట్టు గతంలో నిర్మాతలు ప్రకటించారు. రీసెంట్ గా  విడుదలైన ట్రైలర్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. వీరు సినిమా చేసిన తీరుపై రామ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే నిర్మాతల నుండి మరొక ఆసక్తికరమైన ప్రకటన వచ్చింది. పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ అయిన ఈ సినిమా లో శ్రీలీల రామ్ సరసన నటిస్తుంది. రామ్ పోస్టర్లు మరియు గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కానుండగా, విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 15న సినిమా విడుదల కానుంది.

చిత్ర నిర్మాతలు పోస్టర్ మరియు విడుదల తేదీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్టర్‌లో రామ్ తెల్ల చొక్కా ధరించి పొలంలో మంచంపై ఆనందంగా కూర్చుని ఉన్న లుక్ తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం పాన్-ఇండియాలో కూడా విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి శ్రీనివాస చిట్టూరి నిర్మాత.  సంగీతం: తమన్, కెమెరా: సంతోష్‌ డి. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?