
బలగం సినిమాతో బాగా ఫేమస్ అయ్యారు మొగిలయ్య. ఈసినిమాలో ఆయన ఒకే ఒక్క పాటతో మంచి పేరును తెచ్చుకున్నారు. బలంగంలో క్లైమాక్స్ పాటతో అందరినీ ఏడిపించిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలో కూడా పరిస్థితి విషమించడం.. ట్రీట్మెంట్ ద్వారా ఆయన బయటపడటం జరిగింది. ఇక మరోసారి మొగిలయ్య.. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
గత కొద్ది రోజుల నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మొగిలయ్య.. వరంగల్‌లోని సంరక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన గుండె సంబంధిత వ్యాధితో కూడా బాధపడుతున్నాడు. దీంతో తన భర్త ప్రాణాలను కాపాడాలని, ప్రభుత్వం ఆదుకోవాలని భార్య కొమురమ్మ వేడుకున్నారు. ప్రస్తుతం మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇక మొగిలయ్యకు కరోనా సమయంలో రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. అప్పటి నుంచి ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. వైద్యం కోసం భారీగా ఖర్చు చేయాల్సి రావడంతో.. ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇబ్బందిపడ్డారు. కిడ్నీ సమస్యలతో పాటు గుండె, కంటి చూపు మందగించడం వంటి అనారోగ్య సమస్యలు కూడా మొగిలయ్యాను వెంటాడుతున్నాయి. ఇక గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం, మెగాస్టార్ చిరంజీవి మొగిలయ్య చికిత్సకు సాయం చేశారు. కాని ఇప్పుడు మరోసారి ఆయన పరిస్థితి సీరియస్ అయ్యింది.