
2023 ఫిల్మ్ ఇండస్ట్రీకి తీపి చేదు కలయికలో ఎన్నో జ్ఞాపకాలు అందించింది. కొన్ని సర్ ప్రైజ్ లు కూడా 2023 లో ఫిల్మ్ ఇండస్ట్రీ చూసింది. స్టార్ హీరోల భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు డిజాస్టర్స్ అవ్వడం..మినీబడ్జెట్ తో తెరకెక్కించిన చిన్నసినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడం.. చర్చనీయాంశంగా మారింది ఈఏడాది. ఇక చిన్న సినిమాగా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ బలగం. అచ్చమైన తెలంగాణ సంసృతికి అద్దం పట్టిన ఈసినిమా సెన్సేషన్అయ్యింది.
బాక్సాఫీస్ దగ్గర బలగం తన బలం గట్టిగా చూపించింది. భారీ వసూళ్లను రాబట్టడంతో.. కలెక్షన్ల వరద పారింది. అంతే కాదు దాదాపు 100 పైగా అవార్డ్ లు సాధించిన బలగం సినిమా.. బుల్లితెర పై కూడా తన హవా చూపించింది. హవా అంటే అంతా ఇంతా హవా కాదు టెలివిజన్ రంగంలోనే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఏడాది టాప్ టీఆర్పీ రేటింగ్ ను నమోదు చేసుకున్న చిత్రం గా బలగం నిలిచింది. 14.21 టీఆర్పీ రేటింగ్ ను ప్రీమియర్ టెలికాస్ట్ లో సొంతం చేసుకుంది.
జబర్థస్త్ కమెడయిన్ గా పేరు పొందిన వేణు దర్శకుడిగా మారి... టాలీవుడ్ స్టార్ కమెడియన్ ప్రియదర్శి హీరోగా.. కావ్యకళ్యాణ్ రామ్ హీరోయిన్ గా. బలగం చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం టీవీ లో ప్రసారం అయిన ప్రతిసారీ కూడా మంచి టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. ఒక వైపు నవ్వులు పూయిస్తూనే.. సెంటిమెంట్ తో కంటతడి పెట్టిచాడు దర్శకుడు వేణు. ఇక ఈసినిమాకు బీమ్స్ సంగీతం ప్రాణం పోసిందని చెప్పాలి.