Guntur Kaaram : ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ పై ట్రోల్స్.. సింపుల్ గా క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగ వంశీ!

Published : Dec 30, 2023, 10:24 AM ISTUpdated : Dec 30, 2023, 10:56 AM IST
Guntur Kaaram : ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ పై ట్రోల్స్.. సింపుల్ గా  క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగ వంశీ!

సారాంశం

తాజాగా విడుదల చేసిన సాంగ్ తో ఇప్పుడంతా ‘గుంటూరు కారం’పైనే చర్చ జరుగుతోంది. మహేశ్ బాబు సినిమాలో అలాంటి సాంగ్ ఏంటంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. దీనిపై తాజాగా నిర్మాత నాగవంశీ స్పందించారు. 

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో 13 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రమే ‘గుంటూరు కారం’ (Guntur Kaaram).  మొన్నటి వరకు ఈ మూవీ సందడి పెద్దగా లేదు. కానీ.. తాజాగా విడుదల చేసిన సాంగ్ తో ఇప్పుడంతా ‘గుంటూరు కారం’పైనే చర్చ జరుగుతోంది. మహేశ్ బాబు సినిమాలో అలాంటి సాంగ్ ఏంటంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ వరుసగా అప్డేట్లు ఇస్తున్న విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో నిన్న మూడో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. అయితే అప్పట్లో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిన ‘కుర్చీ మడపెట్టి దె***’ డైలాగ్ గురించి అందరికీ తెలిసిందే. దానిపై పలు రకాలుగా సాంగ్స్ కూడా వచ్చాయి. కాగా.. ఇప్పుడు అదే సాంగ్ ను ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో పెట్టడం చర్ఛనీయాంశంగా మారింది. బాబుకు ఉన్న రేంజ్ ఏంటీ? ఆయన సినిమాలో ఇలాంటి సాంగ్స్ పెట్టడం ఏంటనీ ఫ్యాన్స్, నెటిజన్లూ ప్రశ్నిస్తున్నారు. ట్రోల్స్ కూడా వస్తున్నాయి. 

దీనిపై తాజాగా నిర్మాత నాగ వంశీ Naga Vamsi స్పందించారు. ట్వీటర్ లో ఇలా రాసుకొచ్చారు. ‘ప్రోమోపై వస్తున్న చాలా అభిప్రాయాలను ‘మేము చూశాం. కొంతమంది లిరిక్స్, కొన్ని పదాల వినియోగం గురించి మమ్మల్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఏం లేదు.. మన సూపర్ స్టార్ మహేశ్ బాబు గారు జస్ట్ కుర్చీ మడత పెట్టి  డాన్స్ చేసారు అంతే కదా... దీన్ని పాజిటివ్ గా ఆలోచించండి. GunturKaaram అనేది మాస్, ఫ్యామిలీ, యూత్ అన్ని వర్గాలను సంతృప్తిపరిచే వినోదభరితమైన సినిమా. పూర్తి హై వోల్టేజ్, అన్ని భావోద్వేగాలు ఉన్నాయి. జనవరి 12న తప్పకుండా అభిమానులకు, సినీ ప్రేమికులకు సంక్రాంతి పండుగకు భారీ మాస్ ఫీస్ట్ అవుతుంది.’ అంటూ క్లారిటీ ఇచ్చారు. 

ఇక ఇప్పటికే స్పెషల్ పోస్టర్లు, ‘దమ్ మసాలా’ Dum Masala,  ‘హో మై బేబీ’ Oh My Baby  వంటి సాంగ్స్ కూడా విడుదలై ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ‘కుర్చీ మడత పెట్టి’ ఫుల్ సాంగ్ రాబోతోంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మిస్తున్నారు. శ్రీలీలా (Sreeleela), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)  హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్  సంగీతం అందిస్తున్నారు. 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. 

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: హీరోలు ఒకరి తర్వాత ఒకరు..దుబాయ్ మోజు వెనుక ఇదే కారణం!
Amla Paul: కొడుకుతో క్యూట్ ఫోటోలని షేర్ చేసిన అమలాపాల్.. నెటిజన్ల విమర్శలు