అక్కడ బాహుబలి ఫ్లాప్!

Published : May 09, 2018, 03:45 PM IST
అక్కడ బాహుబలి ఫ్లాప్!

సారాంశం

తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రం బాహుబలి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి గుర్తింపు వచ్చింది

తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రం బాహుబలి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి గుర్తింపు వచ్చింది. ఓవర్సీస్ లో సైతం ఈ సినిమా రెండు భాగాలు భారీ వసూళ్లను సాధించాయి. అలాంటి ఈ సినిమా చైనాలో మాత్రం ఫ్లాప్ అని తేల్చేసారు ట్రేడ్ విశ్లేషకులు. బాహుబలి1 సినిమా చైనాలో ఫ్లాప్ అని తెలిసి కూడా బాహుబలి 2 సినిమాను గత వారం చైనాలో విడుదల చేశారు. విడుదల రోజు సినిమా బాగానే ఆడింది.

మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. కానీ రెండో రోజే ఈ సినిమాకు బ్రేక్ పడింది. ట్రేడ్ పండితుల ప్రకారం సినిమాకు కనీసం రూ.120 కోట్లు వస్తేనే సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగొచ్చినట్లు.కానీ ఈ సినిమా రూ.57 కోట్లు సాధించి చతికిలపడింది. చైనా బాక్సాఫీస్ లెక్కల ప్రకారం ఇది ఫ్లాప్ కింద లెక్క. చైనాలో 'దంగల్' సినిమా సృష్టించిన రికార్డ్స్ ను 'బాహుబలి2' తిరగ రాస్తుందనుకుంటే కనీసపు వసూళ్లు లేక డిస్ట్రిబ్యూటర్లను ఇబ్బంది పెడుతోంది.   

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్