బాహుబలి ది కన్ క్లూజన్ షూటింగ్ పూర్తి

Published : Jan 06, 2017, 08:13 AM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
బాహుబలి ది కన్ క్లూజన్ షూటింగ్ పూర్తి

సారాంశం

బాహుబలి షూటింగ్ నేటితో పూర్తి మొత్తం 613 రోజులు షూటింగ్ జరుపుకున్న రాజమౌళి చిత్రం ఇకనుంచి ప్రభాస్ ఫ్రీ అంటూ ట్వపీట్ చేసిన జక్కన్న

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం బాహుబలి. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన బాహుబలి బిజినెస్ పరంగా  కూడా సంచలనాలు నమోదు చేసింది. ఈ చిత్రం రెండో భాగం.. బాహుబలి ది కన్ క్లూజన్ ఏప్రిల్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. దీనికి సంబంధించిన షూటింగ్ వర్క్ ఈ శుక్రవారంతో ఫినిష్ అయింది.

 

మొత్తం 613 రోజులు బాహుబలి చిత్రం షూటింగ్ జరిగింది. కేవపలం ఈ మూవీ కోసం రానా, ప్రభాస్ ఇద్దరూ రెండేళ్ల పైగా మరే ఇతర సినిమా జోలికి వెళ్లకుండా కమిట్ మెంట్ తో పనిచేశారు. ఎట్టకేలకు ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇక గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నారు.

ఈమేరకు జక్కన్న రాజమౌళి కూడా ప్రభాస్ కమిట్ మెంట్ గురించి పొగడకుండా ఉండలేకపోయాడు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ లో ప్రభాస్ డార్లింగ్ ఓపికకు థాంక్స్ అని చెప్తూ రాజమౌళి ట్వీట్ చేశాడు. బాహుబలి రెండు భాగాల కోసం ప్రభాస్ దాదాపు మూడున్నరేళ్లు కేటాయించారు. అందుకే ఈ థాంక్స్. ఇంతలా నన్ను, ఈ ప్రాజెక్ట్ ను నమ్మినందుకు థాంక్స్ అంటూ జక్కన్న ట్వీట్ చేశాడు.

 

ఇక ప్రభాస్ తదుపరి చిత్రం రన్ రాజా రన్ ఫేం దర్శకుడు సుజీత్ డైరెక్షన్ లో చేయనున్నాడు. అయితే బాహుబలికి సంబంధించి ఇతర వర్క్ అంతా పూర్తి చేశాకే ప్రభాస్ తన తదుపరి చిత్రం షూటింగ్ కు హాజరయ్యే పరిస్థితి లేదు. 150 కోట్లతో తెరకెక్కనున్న తదుపరి చిత్రంపై బాహుబలి ప్రొడక్షన్ వర్క్ అయిపోయాక ప్రభాస్ దృష్టి పెట్టనున్నాడు.

PREV
click me!

Recommended Stories

50 ఏళ్లలో 1000 సినిమాలు, 6 ఏళ్లలో హీరోగా 54 మూవీస్, స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని రికార్డు సాధించిన నటుడు ఎవరో తెలుసా?
రజినీకాంత్ కోసం అట్లీ శిష్యుడు, తలైవర్ 173 కి దర్శకుడు ఎవరో తెలుసా? ఎవరూ ఊహించని కాంబో