బాహుబలికి సంబంధించిన గుట్టు బట్టబయలు చేసిన ఆర్ట్ డైరెక్టర్

First Published Dec 4, 2017, 12:49 PM IST
Highlights
  • బాహుబలి చిత్రంల ోో విరివిగా గ్రాఫిక్స్ వాడిన రాజమౌళి
  • కొన్ని సందర్భాల్లో పురాతన వస్తువులను అద్భుతంగా రూపుదిద్దిన ఆర్ట్ డెరెక్టర్
  • తాజాగా బాహుబలిలో వాడిన కొన్ని అద్భుత టెక్నిక్స్ గురించి వివరించిన సబూ సిరిల్

టాలీవుడ్ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకుపోయిన బాహుబలి సినిమాకు సంబంధించిన ఏ కొత్త విషయమైనా విశేషమే. సినిమా రిలీజై వెళ్లిపోయి ఇన్నాళ్లయినా.. బాహుబలికి సంబంధించిన క్రేజ్ మాత్రం జనాల్లో అలానే వుండిపోయింది. ఆ సినిమాకు సంబంధించి ఏ కొత్త విషయం తెలిసినా ఆసక్తిగా గమనిస్తున్నారు. తాజాగా ఆ సినిమా వెనుక జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలని ఆర్ట్ డైరెక్టర్ సబూసిరిల్ వివరించారు.

 

బాహుబలి,రోబో 2.0 చిత్రాలకు సంబంధించిన ఆసక్తికర అంశాలు చాలానే ఉన్నాయి. బాహుబలిలో స్పటిక లింగం  నేపథ్యంలో వచ్చే సన్నివేశం కోసం వాటర్ బాటిల్స్ ఉపయోగించి శివలింగాన్ని తయారు చేశాం. తక్కువ ఖర్చు కావటంతో పాటు.. చాలా బాగా వచ్చింది. ఇక రానా రథానికి అమర్చిన తిరిగే కత్తిని.. పూర్వం పంటలు కోయటానికి వాడే కత్తిని స్ఫూర్తిగా తీసుకొని చేశాం. నాజర్ కు ఒక చేయి వైకల్యం ఉన్న చేయిలా కనిపించుంకు ఒక కృత్రిమ చేయిని అమర్చాం. అసలు చేతిని కనిపించకుండా ఉండేందుకు పైన శాలువా లాంటి వస్త్రాన్ని ఉంచాం. అందంగా కనిపించే జలపాతం కోసం ఉప్పును వాడాం. చాలా సీన్లు చూసినప్పుడు సీజీ వాడేశారని అనుకుంటారు.కానీ.. చాలా సందర్భాల్లో అలా జరగదు.

 

అన్ని సన్నివేశాలకు సీజీ చేయటం సాధ్యం కాదు. అప్పుడే కళాదర్శకుడి అవసరం ఉంటుంది. బాహుబలి మూవీలో వాడిన ఆయుధాల్లో ఎక్కువ శాతం ఫైబర్ గ్లాస్ తో తయారు చేసినవే. బరువు తక్కువగా ఉండి వాడటానికి ఈజీగా ఉండేలా రూపొందించాం.

 

శంకర్ దర్శకత్వంలో రానున్న రోబో 2.0 సినిమాలో మూడున్నర అడుగులు.. నాలుగున్నర అడుగులు ఉండే రోబోల అవసరం ఏర్పడింది. ఓ కంపెనీ వారిని కలిస్తే రోబోల తయారీకి రూ.5 కోట్లు అవుతుందని చెప్పారు. దీంతో.. వాటర్ హీటర్ బాడీలను ఉపయోగించి రోబోలను తయారు చేశాం. ఖర్చు రూ.5లక్షలతోనే పూర్తి అయ్యింది.

click me!