
తొలిరోజు కలెక్షన్ల రికార్డులు నమోదు చేసిన బాహుబలి2 రెండో రోజు కలెక్షన్లు కాస్త వెనుకబడ్డాయి. అయితే దక్షిణాదిలో ఇది సర్వసాధారణం. కానీ హిందీ వెర్షన్ కలెక్షన్లు మాత్రం రెండో రోజు కూడా ఏ మాత్రం తగ్గలేదు. రెండోరోజు కూడా అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా బాహుబలి2 రికార్డు సృష్టించింది.
హిందీ వెర్షన్ తొలిరోజు 41 కోట్ల రూపాయల నెట్ వసూలు చేయగా, రెండో రోజు 40 కోట్ల రూపాయలు వసూలు సాధించిందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన ఏకైక సినిమా బాహుబలి2నే. తొలురోజుతో పోలిస్తే రెండో రోజు పెద్దగా ఎలాంటి తగ్గుదల కనిపించలేదు. దేశ చరిత్రలో మరే సినిమా ఈ అరుదైన రికార్డు సాధించలేదు.
తొలి రెండ్రోజుల్లో 81 కోట్లు సాధించిన హిందీ వెర్షన్ బాహుబలి2 సల్మాన్ ఖాన్ సినిమా సుల్తాన్ తొలి వీకెండ్ వరకు సాధించిన 105కోట్ల కలెక్షన్లను తేలిగ్గా క్రాస్ చేయనుంది. ఇక తెలుగు, తమిళ, మళయాల వెర్షన్ల కలెక్షన్లు కలిపితే వచ్చే నంబర్ నమ్మలేనంత భారీగా ఉంటుంది.
ఇక బాహుబలి2 ఓపెనింగ్ వీకెండ్ వరకే 500కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధిస్తుందని తెలుస్తోంది. ఇక వెయ్యి కోట్ల టార్గెట్ రీచ్ కావడం, మిగతా రోజుల్లో మరో 500 కోట్లు కొల్లగొట్టడం పెద్ద సమస్యే కాదు. మొత్తానికి అందుతున్న సమాచారం ప్రకారం రెండో రోజు కలెక్షన్స్ బ్రేకప్ వివరాలు త్వరలోనే అందిస్తాం.