`కట్టప్ప` సత్యరాజ్‌ ఇంటో విషాదం..

Published : Dec 06, 2021, 08:56 PM IST
`కట్టప్ప` సత్యరాజ్‌ ఇంటో విషాదం..

సారాంశం

`బాహుబలి` చిత్రంలో `కట్టప్ప`గా నేషనల్‌ వైడ్‌గా పాపులర్‌ అయ్యారు నటుడు సత్యరాజ్‌. ఆయన ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. సత్యరాజ్‌ చెల్లెలు కన్నుమూశారు. 

విలక్షణ నటుడు, `కట్టప్ప` సత్యరాజ్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. సత్యరాజ్‌ చెల్లెలు కల్పన మండ్రాదియార్‌(66) శనివారం తుదిశ్వాస విడిచారు. తమిళనాడులోని తిరుప్సూర్‌ జిల్లా గాంగేయంలో నివసిస్తున్న కల్పన కొద్దివారాలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెని కుటుంబ సభ్యులు కోయంబత్తూరులోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం కన్నుమూశారు. దీంతో సత్యరాజ్‌ ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సత్యరాజ్‌ సోదరి మృతి పట్ల టాలీవుడ్‌, కోలీవుడ్‌ సినీ తారలు సంతాపం తెలిపారు. 

సత్యరాజ్‌ `బాహుబలి` చిత్రంతో పాపులర్‌ అయ్యారు. ఇందులో కట్టప్పగా ఆయన నేషనల్‌ వైడ్ గా పాపులర్‌ అయ్యారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయం నేషనల్ వైడ్‌గా చర్చనీయాంశంగా మారింది. రెండో భాగంపై ఆసక్తిని, అంచనాలను పెంచింది. అందుకు తగ్గట్టుగానే సినిమా సంచలన విజయం సాధించింది. తమిళంలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్యరాజ్‌ ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారారు. విలక్షణ పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. హీరోగా కంటే నటుడిగానే ఆయనకు మంచి గుర్తింపు రావడం విశేషం. 

`శంఖం` చిత్రంతో తెలుగులోకి పరిచయం అయిన సత్యరాజ్‌.. ప్రభాస్‌తో `మిర్చి` సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. `నేను శైలజ`, `హైపర్‌`, `బ్రహ్మోత్సవం`, `బాహుబలి`, `నోటా`, `జెర్సీ`, `ప్రతి రోజు పండగే` చిత్రాల్లో నటించి మెప్పించారు. హీరోహీరోయిన్లకి తండ్రి పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన తెలుగులో గోపీచంద్‌తో `పక్కా కమర్షియల్‌` సినిమా చేస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే