
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం బాహుబలి 2. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న బాహుబలి 2 షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అయితే...ఈ చిత్రానికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఎక్కువుగా ఉండడం వలన అనుకున్న విధంగా ఏప్రిల్ 28న బాహుబలి 2 ప్రేక్షకుల ముందుకు ఎలాగైనా తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి 2 విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ కమల్ కణ్ణన్ రిలీజ్పై ఊహాగానాలకు ఫుల్ స్టాఫ్ పెట్టారు. ఇండియాలోని విఎఫ్ ఎక్స్ స్టూడియోల్లో గత 15 నెలలుగా వర్క్ జరుగుతుంది. వరల్డ్ వైడ్ 33 కంటే ఎక్కువ స్టూడియోల్లో బాహుబలి 2 వర్క్ జరుగుతుంది అని కమల్ కణ్ణన్ తెలియచేసారు. సో...ఎనౌన్స్ చేసిన విధంగా బాహుబలి 2 ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం అనుకోవచ్చు..!
ఇక బాహుబలి గత ఏడాది రిలీజ్ అయి సంచలన విజయం సాధించడంతో బాహుబలి 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఆ చిత్ర హక్కులను సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. తమిళనాట రికార్డ్ స్థాయిలో అమ్ముడు పోయింది బాహుబలి 2. బాహుబలి గత ఏడాది రిలీజ్ అయి సంచలన విజయం సాధించడంతో బాహుబలి 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి దాంతో ఆ చిత్ర హక్కులను సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు . ఇక ఆ పోటీలో శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్ సంస్థ 47 కోట్లకు తమిళ హక్కులను సొంతం చేసుకుంది. ఒక డబ్బింగ్ సినిమా ఇంతటి భారీ మొత్తానికి అమ్ముడుపోవడం తమిళనాట సంచలనం సృష్టిస్తోంది . ఒక్క రజనీకాంత్ చిత్రానికి మినహా ఇంతటి పెద్ద రేటు ని మరే చిత్రానికి రాలేదు . దాంతో మరింత సంచలనం అయ్యింది.