దిల్ రాజు బ్యానర్ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన 'బేబీ' హీరోయిన్.. ఆ హీరోతో రొమాన్స్, టైటిల్ ఫిక్స్

Published : Dec 24, 2023, 03:41 PM IST
దిల్ రాజు బ్యానర్ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన 'బేబీ' హీరోయిన్.. ఆ హీరోతో రొమాన్స్, టైటిల్ ఫిక్స్

సారాంశం

ఈ ఇయర్ టాలీవుడ్ కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది "బేబి" సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని ఘన విజయం సాధించింది. ఈ చిత్రం ద్వారా అచ్చతెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

ఈ ఇయర్ టాలీవుడ్ కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది "బేబి" సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని ఘన విజయం సాధించింది. ఈ చిత్రం ద్వారా అచ్చతెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. బేబీ మూవీలో ఆమె పెర్ఫామెన్స్ కి యువత ఫిదా అయ్యారు. 

తెలంగాణ అమ్మాయి కావడంతో ఆమెకి ఇంకా పబ్లిసిటీ పెరిగింది. అందంగా కనిపిస్తూనే ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో కట్టిపడేసింది. ఇదే ఊపులో ఆనంద్ దేవరకొండతో మరో చిత్రం చేస్తోంది వైష్ణవి. తాజాగా వైష్ణవి చైతన్య మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. 

బడా నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కబోతున్న ఓ చిత్రంలో వైష్ణవి చైతన్యకి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అరుణ్ భీమవరపు అనే డెబ్యూ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. హీరో ఎవరో కాదు దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి. వైష్ణవి చైతన్య తొలిసారి ఆశిష్ రెడ్డితో రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రానికి 'లవ్ మీ' అనే రొమాంటిక్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆశిష్ రెడ్డి గతంలో రౌడీ బాయ్స్ అనే చిత్రంలో నటించాడు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీనితో తన సోదరుడి కొడుకుని హీరోగా నిలబెట్టాలని దిల్ రాజు పట్టుదలతో ఉన్నారు. వైష్ణవి చైతన్యని తీసుకువచ్చి ఈ కాంబినేషన్ ని క్రేజీగా మార్చేసారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రెండో భార్యతో కూడా దర్శకుడు విడాకులు ? మొన్న తమ్ముడు, ఇప్పుడు అన్న.. ఫోటోలు డిలీట్ చేసిన భార్య
Demon Pavan: రీతూ కంటే వాళ్లిద్దరూ హౌస్ లో ఉండడమే పవన్ కి ఇష్టమా.. తనూజపై నమ్మకం లేదంటూ..