'అమ్మ నా చట్నీ': జగపతిబాబుని బాబు గోగినేని వెటకారం

Surya Prakash   | Asianet News
Published : Jun 12, 2021, 01:40 PM IST
'అమ్మ నా చట్నీ': జగపతిబాబుని బాబు గోగినేని వెటకారం

సారాంశం

అమ్మ నాటీ! తమరు దుకాణం తెరవబోతున్నట్టు చెప్పకుండా.. ఆనందయ్య చట్నీ గుణగణాలు మెచ్చుకుంటూ మాట్లాడటం భలే బిజినెస్ టాక్టిక్ యాక్టర్ గారూ.. 

రీసెంట్ గా  ఆనందయ్య మందు విషయంలో జగపతిబాబు స్పందిస్తూ తన పూర్తి మద్దతును ప్రకటించిన విషయం తెల్సిందే. ఆయుర్వేద మందు ను తప్పకుండా ప్రతి ఒక్కరు స్వాగతించాల్సిందిగా ఆయన సూచించాడు. ఈ క్రమంలో ఆయన గురించిన ఓ వార్త ఇప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ లో అతి పెద్ద ఆయుర్వేద స్టోర్‌ ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఆయన చెబుతున్నాడు. ఆయుర్వేదం మందును ఇవ్వడం లో నిపుణులను ఆయన తీసుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఈ విషయమై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ విషయం బయిటకు  రాగానే బాబు గోగినేని వెటకారం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్ చేసారు.

‘అమ్మ నాటీ! తమరు దుకాణం తెరవబోతున్నట్టు చెప్పకుండా.. ఆనందయ్య చట్నీ గుణగణాలు మెచ్చుకుంటూ మాట్లాడటం భలే బిజినెస్ టాక్టిక్ యాక్టర్ గారూ.. కానీ తెలివైనవాడు ఎవడైనా కొంచెం ఆగి చెప్పేవాడు. ఈ ఆత్రం మనకే చేటు’ అంటూ జగపతిబాబుపై పోస్ట్‌ పెట్టారు బాబు గోగినేని.

ఇక జగపతిబాబు తాను ఆనందయ్య మందును ఎప్పుడో వాడానని, ఆయుర్వేదం హానీ చేయదని తాను బలంగా నమ్ముతానన్నారు. 
జగపతిబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఆనందయ్య ఆయుర్వేద మందుని వాడిన వారిలో తాను ఒక‌డినని. తనకు క‌రోనా రాలేదని ఆయన స్ప‌ష్టం చేశారు. ‘‘ఎవరేమన్నా సరే.. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్‌ అయితే ఉండవు. కచ్చితంగా మంచే జరుగుతుందని నేను ఆనందయ్య మందుని వాడాను. అదృష్ట‌వ‌శాత్తు ఇప్ప‌టి వ‌ర‌కు నాకు కోవిడ్ రాలేదు. చాలా హ్యాపీగా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. 

అలాగే ‘ఆయుర్వేదం మందులను పకృతి సహాజమైన ఔషధాలతో తయరు చేస్తారు. అలాంటి మందు ఎలాంటి హానీ చేయ‌దని నేను విశ్వ‌సిస్తున్నాను. నేచర్, భూదేవి తప్పు చేయదు. ఆనందయ్య మందు విషయంలో చాలామంది అభిప్రాయాలు చూశాను.. రకరకాల వీడియోలు చూసిన తరువాత ఓ అభిప్రాయానికి వచ్చాను’’ అన్నారు జగపతిబాబు. 
 

PREV
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?