బాబు గోగినేనికి 'బిగ్ బాస్' మద్దతు!

First Published Jul 21, 2018, 11:31 AM IST
Highlights

హౌస్ లో బలమైన కంటెస్టెంట్ గా ఉన్న బాబు గోగినేనికి నోటీసులు పంపే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయంలో కలుగజేసుకున్న బిగ్ బాస్ టీమ్ ఆయనకు కోర్టు నుండి స్టే  తీసుకొచ్చారు.

బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ ప్రముఖ హేతువాది అయిన బాబు గోగినేనిపై దేశ ద్రోహం, ఆధార్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇతరుల ఆధార్ సమాచారాన్ని పక్క దేశాలకు అందజేయడం, హేతువాద ప్రచారం కోసం విదేశాల నుండి నిధుల సేకరణ తదితర ఆరోపణల కింద ఆయనపై ఐపీసీ సెక్షన్ 121, 121ఏ, 153 ఏ , 53బీ, 406, 420, 504, 505, 295ఏ, 292, 293 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఆయనపై కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నెల 25వ తేదీ లోగా కౌంటర్ దాఖలు చేయాలని సైబరాబాద్ పోలీసులను కోర్టు ఆదేశించింది. హౌస్ లో బలమైన కంటెస్టెంట్ గా ఉన్న బాబు గోగినేనికి నోటీసులు పంపే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయంలో కలుగజేసుకున్న బిగ్ బాస్ టీమ్ ఆయనకు కోర్టు నుండి స్టే  తీసుకొచ్చారు.

ఆయన బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాతే పోలీసులు విచారించేలా కోర్టు స్టే  విధించింది. నిజానికి ఈ కేసు తీవ్రత ఎక్కువగా ఉండడంతో బాబు గోగినేని అరెస్ట్ తప్పదని భావించారు. కానీ ఆయన బిగ్ బాస్ నిర్వాహకులు ఆయన్ను బయటకు పంపలేక తమ పలుకుబడి ఉపయోగించి బాబుకి స్టే  తీసుకొచ్చారని టాక్.   

click me!