బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా ఇంట తీవ్ర విషాదం, ఆయన తండ్రి పి.ఖురానా కన్నుమూత

Published : May 19, 2023, 08:16 PM IST
బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా ఇంట తీవ్ర విషాదం, ఆయన తండ్రి పి.ఖురానా కన్నుమూత

సారాంశం

ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అయితే స్టార్ నటులు.. లేకుంటే వారి కుటుంబ సబ్యులు వరుసగా మరణించడంతో.. ఇండస్ట్రీలో విషాదాన్ని నింపుతోంది. తాజాగా బాలీవుడ్ హీరో ఇంట తీవ్రవిషాదం చోటు చేసుకుంది. 

బాలీవుడ్ స్టార్ హీరో కమ్ సింగర్ ఆయుష్మాన్ ఖురానా ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయుష్మాన్ తండ్రి  ప్రముఖ జ్యోతిష్యుడు వీరేంద్ర ఖురానా అలియాస్ పి.ఖురానా ఈరోజు (శుక్రవారం 19 మే) ఉదయం హాస్పిటల్ లో   కన్నుమూశారు. గుండె సంబంధింత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గత కొంత కాలంగా ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కొన్ని రోజులుగా ఆయన వెంటిలేటర్​పై ట్రీట్​మెంట్ పొందుతున్నారు. ఇక  పి.ఖురానా.. ఆరోగ్య పరిస్థితి  శుక్రవారం విషమించడంతో ఉదయం తుదిశ్వాస విడిచారు. 

పి.ఖురానా బాలీవుడ్ లో చాలా మంది స్టార్లకు సన్నిహితంగా ఉంటారు. దాంతో ఆయన మృతి విషయం తెలియడంతో  బాలీవుడ్​లో విషాద ఛాయలు అలముకున్నాయి.పి.ఖురానా అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు మణిమజ్ర శ్మశాన వాటికలో జరగాయి. ఇక పి.ఖురానా  మృతిపై  బాలీవుడ్ తో పాటు.. చిత్రపరిశ్రమకు  చెందిన ప్రముఖులు, ఆయుష్మాన్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.  ఆయుష్ కు స్వయంగా ఫోన్  చేసి కొంత మంది స్టార్స్ సంతాపం తెలిపారు. 

 బాలీవుడ్​ యంగ్ హీరోల్లో ఆయుష్మాన్ కూడా ఒకరు. మల్టీ టాలెంట్ తో బాలీవుడ్ లో రాణిస్తున్నాడు ఆయుష్మాన్ ఖురానా. విక్కీ డోనర్​ సినిమాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన .. ఫస్ట్ మూవీతోనే మంచి హిట్ కొట్టారు. ఆ తర్వాత వరుస సినిమాలతో తన సత్తా చాటి... విలక్షణమైన  నటనతో బాలీవుడ్ ను మెప్పించాడు. ఇక అంధాధున్​ సినిమాలో ఆయుష్మాన్ అద్భుతమైన నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది.

అయితే తాజాగా  పంజాబ్ యూనివర్సిటీ ఆయుష్మాన్ ఖురానాకు సత్కారం  ఏర్పాటు చేసింది. సరిగ్గా అదే సమయంలో తన  తండ్రి మృతితో ఆయన విషాదంలో మునిగిపోయారు. కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. 
 

PREV
click me!

Recommended Stories

కెరీర్ మొత్తం అలాంటి సినిమాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్న బాలయ్య హీరోయిన్.. సూపర్ హిట్ మూవీపై విమర్శలు
రాజమౌళి తో రెండు సినిమాలు మిస్సైన అన్ లక్కీ స్టార్ హీరో ఎవరో తెలుసా?