Devara Title: దేవర టైటిల్ నాది అంటూ బండ్ల గణేష్ సంచలనం!

Published : May 19, 2023, 05:39 PM IST
Devara Title: దేవర టైటిల్ నాది అంటూ బండ్ల గణేష్ సంచలనం!

సారాంశం

ఎన్టీఆర్ 30 టైటిల్ దేవర అని ప్రముఖంగా వినిపిస్తోంది. అధికారికంగా ప్రకటించకున్నా దేవర టైటిల్ ఫిక్స్ అంటున్నారు. ఈ టైటిల్ నాది అంటూ బండ్ల గణేష్ అసహనం వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.   

ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్ర టైటిల్ మరి కాసేపట్లో రివీల్ కాబోతుంది. ఎన్టీఆర్ బర్త్ డేని పురస్కరించుకుని మే 19న ఫస్ట్ లుక్ అండ్ పోస్టర్ విడుదల చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ దేవర అనే టైటిల్ ఫిక్స్ చేశాడని గట్టిగా వినిపిస్తోంది. టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దేవర టైటిల్ ఫైనల్ చేశారు. అయితే ఈ టైటిల్ ని కొన్నేళ్ల క్రితమే నిర్మాత బండ్ల గణేష్ రిజిస్టర్ చేయించారు. 

దేవర టైటిల్ తో పవన్ కళ్యాణ్ తో మూవీ నిర్మించాలనేది ఆయన డ్రీమ్. పవన్ ని ఆరాధించే బండ్ల గణేష్ ఆయన్ని దేవర అని పిలుచుకుంటారు. ఆ టైటిల్ పవన్ కళ్యాణ్ కి బాగా సూట్ అవుతుందని ఆయన నమ్మకం. రిజిస్టర్ అయితే చేయించాడు కానీ దాన్ని రెన్యువల్ చేయించడం మర్చిపోయాడు. దాంతో దేవర టైటిల్ ని కొరటాల శివ వాడుకోబోతున్నాడు. 

ఇది బండ్ల గణేష్ రిజిస్టర్ చేసుకున్న టైటిల్ అని కొద్ది రోజులుగా ప్రచారం అవుతుంది. నేడు ఆయనే బయటపడ్డారు. ఒకింత అసహనం వ్యక్తం చేశారు. నేను రిజిస్టర్ చేయించుకున్న టైటిల్. రెన్యువల్ చేయడం మర్చిపోవడంతో కొట్టేశారు... అని కామెంట్ పోస్ట్ చేశారు. అలాగే యాంగ్రీ ఏమోజీ పోస్ట్ చేశాడు. దేవర టైటిల్ ఎన్టీఆర్ చిత్రానికి వాడుకున్నందుకు బండ్ల గణేష్ కోపంగా ఉన్నారని అర్థమైంది. 

 ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో ఇది రెండో చిత్రం. గతంలో జనతా గ్యారేజ్ చిత్రం చేశారు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. చాలా కాలం తర్వాత మరోసారి చేతులు కలిపారు. ఎన్టీఆర్ 30లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. దాదాపు రూ 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరక్కుతుంది. ఎన్టీఆర్ 30 విడుదలకు ఏడాది సమయం మాత్రమే ఉంది. 2024 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌