ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య పోరాటం..సెకను కూడా చూపు తిప్పుకోలేరు, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అంటున్న డైరెక్టర్

Published : Jun 20, 2025, 01:53 PM IST
Hrithik Roshan and Jr NTR

సారాంశం

హృతిక్, ఎన్టీఆర్‌లతో రూపొందుతున్న వార్ 2 గురించి దర్శకుడు అయాన్ ముఖర్జీ స్పందించారు.ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ గురించి అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.   

హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' చిత్రంపై దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న ఫ్రాంఛైజీలో ఇది రెండో భాగం. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉన్న నేపథ్యంలో అయాన్ ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్ర విశేషాలు వివరిస్తూ ఫ్యాన్స్ ని అలరించే ఈ చిత్రంలో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి అనేది రివీల్ చేశారు.

ప్రాంఛైజీని కొనసాగించే బాధ్యత 

ఐఏఎన్‌ఎస్‌తో జరిగిన ఇంటర్వ్యూలో అయాన్ మాట్లాడుతూ," వార్ ప్రాంఛైజీపై ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతగా ప్రేమించబడిన ఫ్రాంఛైజీని కొనసాగించడం పెద్ద బాధ్యత. అదే సమయంలో, దానికి నా స్వంత ముద్ర వేసే అవకాశం కూడా నాకు దక్కింది," అని అన్నారు. వార్ 2ను మొదటి భాగానికి మించేలా ఆ సక్సెస్ ని కొనసాగించేలా  తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో పని చేస్తున్నాను," అని చెప్పారు.

స్టార్ కాంబినేషన్‌కు తగిన కథ

హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు భారీ స్టార్‌లను కలిపే కథను సృష్టించడం, దానిని అద్భుతంగా తీర్చి దిద్దడం తన ప్రధాన ధ్యేయమని అయాన్ తెలిపారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య పోరాట సన్నివేశాలపై ఎక్కువగా ఫోకస్ చేశాం. ఆ సన్నివేశాలతో ప్రేక్షకులకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అందించాలనేది నా టార్గెట్. థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు ఈ చిత్రంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించే విధంగా ఉండాలి. పోరాట సన్నివేశాలతో పాటు ఈ కథలో వారిద్దరి పాత్రల మధ్య ఉన్న ఎమోషనల్ కనెక్షన్‌ను ఆసక్తికరంగా మలచే పనిలో ఉన్నట్లు అయాన్ వివరించారు.

యాక్షన్ ప్లానింగ్ పై దృష్టి

వార్ 2లో అత్యధిక సమయం యాక్షన్ సన్నివేశాల రూపకల్పనకే కేటాయించామని అయాన్ వెల్లడించారు. హృతిక్ పాత్ర ఏజెంట్ కబీర్తో ఎన్టీఆర్ పోటీ పడేలా మలచిన సన్నివేశాలు ఈ చిత్రంలో హైలైట్ గా నిలిస్తాయి. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు అంతర్జాతీయ ప్రమాణాలతో విజువల్ గా వండర్ అనిపించేలా ఉండాలని సినిమా ప్రారంభానికి ముందే నిర్ణయించుకున్నట్లు అయాన్ తెలిపారు. 

ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ

ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. అతనికి హృతిక్ ప్రధాన విరోధిగా ఉండబోతున్నారు. ఈ పోటీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. సంగీతాన్ని ప్రీతమ్ చక్రవర్తి అందిస్తున్నారు.

విడుదల తేది

వార్ 2 సినిమాను 2025 ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారు. అదే రోజున రజనీకాంత్ నటించిన 'కూలీ' సినిమా కూడా విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొనబోతోంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి. 'వార్ 2' భారతీయ స్పై యాక్షన్ సినిమాల్లో ఒక కొత్త స్టాండర్డ్‌ను ఏర్పరచనుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఎన్టీఆర్ మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ చివరగా దేవర చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రావాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్