
బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ మరోసారి వార్తల్లో నిలిచింది. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్న ఈ బ్యూటీ, కాస్త విరామం తీసుకుని ఫారెన్ వెళ్లింది. ప్రస్తుతం ఆమె అక్కడ తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి విహరిస్తుంది. వీరిద్దరూ కలిసి లండన్ వీధుల్లో నడుస్తున్న సమయంలో ఓ అభిమాని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా అది వైరల్ అవుతోంది. సదరు వీడియోలో జాన్వీ, శిఖర్ పహారియా కలసి ఓ వీధి లో నవ్వుతూ నడుస్తూ కనిపించారు.
ఈ వీడియో ప్రస్తుతం ఎక్స్ తో పాటు ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో హల్‌చల్ చేస్తోంది. ప్రైవసీ కోసం విదేశాలకు వెళ్లినా, అభిమానుల కంటపడకుండా తప్పించుకోవడం వీరి తరం కాలేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. “వాళ్లు నిజంగా జంటేనా?”, “ఇంకా కలిసే ఉన్నారా?”, “పెళ్లి ఎప్పుడు?” వంటి కామెంట్లతో సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
ఇది తొలిసారి కాదు – గతంలో జాన్వీ , శిఖర్ కలిసి ముంబైలోని ప్రముఖ రెస్టారెంట్ల వద్ద కనిపించారు. అంతేకాదు ఎన్నో సార్లు వీరు తిరుమల శ్రీవారిని కలిసి దర్శన చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇలా అనేక ఈవెంట్స్ కు వీరిద్దరూ కలిసి వెళ్లిన వీడియోలు, ఫోటోలు ఎప్పటి నుంచో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ లండన్ టూర్‌తో మరోసారి ఈ జంట వార్తల్లోకి వచ్చారు. అయితే ఈ వీడియోలు జాన్వీ కపూర్ చెల్లెలు కుషికపూర్ కూడా కనిపిస్తుండటం విశేషం.
ఇక సినిమాల విషయానికొస్తే, జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన పెద్ది సినిమాలో నటిస్తోంది జాన్వీ. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తోన్న ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పెద్ది నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో జాన్వీ ఓ సంప్రదాయ పల్లెటూరి యువతిగా కనిపించనున్నారు. పాత్రకు తగ్గట్టుగా ఆమె డ్రెస్, మేకప్, భాషలో మార్పులు చేసుకుంటూ నటనలో పూర్తిగా మునిగి తేలుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంతో పాటు సౌత్ లో మరికొన్ని సినిమాలు జాన్వీ కపూర్ కోసం ప్రపోజల్ స్టేజ్ లో ఉన్నాయి. తాజా సమాచారం మేరకు సినిమాల నుంచి కాస్త విరామం తీసుకున్న జాన్వీ, ఈ సమయంలో విదేశాల్లో విహరిస్తూ సమయాన్ని శిఖర్‌తో గడుపుతున్నారు.