అవినాష్‌.. జోకర్‌గానే మిగిలిపోతాడా..? బిగ్‌బాస్‌లో ఏం జరుగుతుంది!

Published : Dec 06, 2020, 12:15 PM IST
అవినాష్‌.. జోకర్‌గానే మిగిలిపోతాడా..? బిగ్‌బాస్‌లో ఏం జరుగుతుంది!

సారాంశం

పదమూడో వారంలో కూడా ఎలిమినేషన్‌తో పోరాడుతున్నాడు. ప్రస్తుతం అవినాష్‌, మోనాల్‌ ఎలిమినేషన్‌కి దగ్గరలో ఉన్నారు. ఈ వారం మోనాల్‌ ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదే నిజమైతే అవినాష్‌ ఈ వారం బతికిపోయినట్టే అని చెప్పాలి. 

అవినాష్‌ వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంటర్‌ అయ్యాడు. జోకర్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. తాను జోకర్‌ని అని, తన జీవితంలోని అన్నీ కష్టాలే అని సినిమా కథలా చెప్పి అందరి హృదయాలను గెలుచుకున్నారు. చాలా వరకు నామినేషన్‌కి దూరంగా ఉంటూ వస్తున్నాయి. అందరితో బాగా ఉంటూ అలరిస్తున్నాడు. కానీ రెండు సార్లు ఎలిమినేషన్‌ వరకు వెళ్ళి తిరిగొచ్చాడు. 

పదమూడో వారంలో కూడా ఎలిమినేషన్‌తో పోరాడుతున్నాడు. ప్రస్తుతం అవినాష్‌, మోనాల్‌ ఎలిమినేషన్‌కి దగ్గరలో ఉన్నారు. ఈ వారం మోనాల్‌ ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదే నిజమైతే అవినాష్‌ ఈ వారం బతికిపోయినట్టే అని చెప్పాలి. అలాగని వచ్చే వారం కూడా ఆయన్ని ఎలిమినేషన్‌ వెంటాడే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. 

అయితే బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో టాప్‌ ఫైవ్‌లోకి అఖిల్‌తోపాటు అభిజిత్‌, సోహైల్‌, అరియానా, హారిక వెళ్ళే ఛాన్స్ ఉందనే టాక్‌ వినిపిస్తుంది. ఇదే నిజమైతే వచ్చే వారం అవినాష్‌ ఎలిమినేట్‌ ఖాయమంటున్నారు. ఈ లెక్కన అవినాష్‌ నిజంగానే జోకర్‌గా మిగిలిపోతారని చెప్పొచ్చు. కమెడీయన్‌ చివరికి కూరలో కరివేపాకు మాదిరిగానే మిగిలిపోతాడా? ఏదైనా మిరాకిల్‌ సృష్టిస్తాడా? చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?
Top 10 Heroes: హవా చూపించిన మహేష్‌, పవన్‌.. ఇండియా టాప్‌ 10 హీరోలు వీరే.. నెం 1 ఎవరంటే?