అవతార్‌ 2 అఫీషియల్ అనౌన్స్ మెంట్, ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Published : May 16, 2023, 09:57 PM ISTUpdated : May 16, 2023, 10:22 PM IST
అవతార్‌ 2 అఫీషియల్ అనౌన్స్ మెంట్, ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

సారాంశం

హాలీవుడ్ సినిమాల లవర్స్ కు గుడ్ న్యూస్.. అవతార్2 సినిమాను  థియేటర్లలో చూడలేక పోయిన వారి కోసం కొత్త అప్‌డేట్ వచ్చేసింది. అవతార్‌ 2 ఓటీటీలో సందడి చేసే టైం ఫిక్సయింది.

డిస్నీ+హాట్‌ స్టార్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతోంది అవతార్ 2 మూవీ. అవతార్‌ 2 జూన్‌ 7న ప్రీమియర్‌ కానుంది. ఈ హాలీవుడ్ ప్రాజెక్ట్‌ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ ప్లాట్‌ఫాం అధికారికంగా ట్వీట్ చేసింది. ప్రపంచం అంతా ఎదురు చూసిన ఈసినిమా.. వరల్డ్‌ వైడ్ గా థియేటర్స్ ను షేక్ చేసింది. బాక్సాఫీస్ బ్లాస్టింగ్ కలెక్షన్స్ తో అదరగొట్టింది. అంతే కాదు సినిమా చరిత్రలోనే  అత్యధిక గ్రాస్ సాధించిన మూడో సినిమాగా నిలిచింది అవతార్‌ 2. 

 

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు  జేమ్స్ కామెరాన్‌ డైరెక్ట్ చేసిన ఈసినిమాను  జాన్‌ లాండౌ నిర్మించగా.. సిమొన్‌ ఫ్రాగ్లెన్‌ సంగీతం అందించాడు. ఇక సామ్‌ వర్తింగ్‌టన్‌, జోయ్‌ సాల్దన, కేట్‌ విన్స్‌లెట్‌, స్టీఫెన్‌ లాంగ్‌ అవతార్2 లో ప్రధాన పాత్రల్లో కనిపించారు. ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో రిలీజ్ అయ్యింది ఈసినిమా దాదాపు 160 భాషల్లో.. 55 వేలకు పైగా థియేటర్లలో.. గ్రాండ్ గా రిలీజ్ అయిన అవతార్ 2. రికార్డ్ కలెక్షన్స్ గరించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 

హాలీవుడ్‌ దర్శకనిర్మాత జేమ్స్‌ కామెరాన్‌  సృష్టించిన సిల్వర్ స్క్రీన్‌ విజువల్ వండర్‌ అవతార్‌. ఈ ప్రాంఛైజీలో గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది అవతార్‌ 2 . సీక్వెల్‌ కూడా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అవతార్‌ 2 డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో ఎప్పుడొస్తుందని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్‌. ఎట్టకేలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మూవీని ఎంజాయ్ చేయబోతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Tollywood Villains: స్క్రీన్ పై వణుకుపుట్టించే విలన్లకు అందమైన భార్యలు, సోనూసూద్ నుంచి షాయాజీ షిండే వరకు
DDLJ: 30 ఏళ్లుగా ఒకే ఒక్క థియేటర్లో నడుస్తున్న సినిమా, 4 కోట్ల బడ్జెట్ పెడితే 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఏదో తెలుసా?