యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) లేటెస్ట్ ఫిల్మ్ ‘బేబీ’. నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా థర్డ్ సింగిల్ విడుదల చేసి సపోర్ట్ గా నిలిచారు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్రదర్ గా ఆనంద్ దేవరకొండ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘దొరసాని’ చిత్రంతో హీరోగా మంచి పేరు దక్కించుకున్నారు. ఆ తర్వాత నుంచి వరుస చిత్రాలతో అలరిస్తూనే వస్తున్నారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’, ‘పుష్పక విమానం’, ‘హైవే’ వంటి చిత్రాల తర్వాత ఆనంద్ నటిస్తున్న చిత్రం Baby. ఈ చిత్రం నుంచి యూనిట్ వరుసగా అప్డేట్స్ అందిస్తూ వస్తోంది.
అయితే ఇప్పటికే బేబీ టీజర్ తో పాటు రెండు పాటలను కూడా విడుదల చేసింది యూనిట్. తాజాగా థర్డ్ సింగిల్ సైతం వచ్చేసింది. బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్ విడుదలై ఆకట్టుకుంటోంది. అయితే ఈ సాంగ్ ను నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) లాంచ్ చేయడం విశేషంగా మారింది. చిత్ర యూనిట్ కు తనవంతుగా ఇలా సపోర్ట్ గా నిలిచింది. అయితే గతంలో వచ్చిన టీజర్ కు కూడా రష్మిక తన రివ్యూను అందించి మద్దుతుగా ఉంది.
తాజాగా ‘ప్రేమిస్తున్న’ అనే టైటిల్ తో మూడో పాటను విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. సురేష్ బాణిశెట్టి అందించిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. పీవీఎన్ఎస్ రోహిత్ చక్కటి గాత్రం అందించారు. తన మెలోడీ టోన్ తో కట్టిపడేశారు. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ క్యాచీ ట్యూన్ ను అందించారు. సాంగ్ వినసొంపుగా ఉంది.
‘బేబీ’లో హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్నారు. చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల నేషనల్ అవార్డ్ అందుకున్న సాయి రాజేష్ తదుపరి చిత్రం కావడం సినిమాకు ప్లస్. రీసెంట్ గా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ క్రేజీ అప్డేట్ వదులుతున్నారు. తాజాగా బ్యూటీఫుల్ లవ్ స్టోరీని తెలియజేలా టీజర్ ను వదిలారు.
3rd Single OUT NOW!
The Heart Breaking Song of the season that'll sting your hearts!
- https://t.co/Sr8Jfr3xsM
Publicity Designs: pic.twitter.com/vlwGy5F4QM