రష్మికకు షాక్ ఇచ్చిన రౌడీ ఫ్యాన్స్, వదినా అంటూ ఆనంద్ దేవరకొండ సినిమా ఫంక్షన్ లో అల్లరి

Published : May 16, 2023, 09:03 PM ISTUpdated : May 16, 2023, 09:12 PM IST
రష్మికకు షాక్ ఇచ్చిన రౌడీ ఫ్యాన్స్, వదినా అంటూ ఆనంద్ దేవరకొండ సినిమా ఫంక్షన్ లో అల్లరి

సారాంశం

రౌడీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు..  రష్మికను పట్టుకుని వదినా అంటూ టీజ్ చేశారు.. ఆనంద్ దేవరకొండ వదినమ్మ అంటూ.. హడావిడి చేశారు..  సినిమా ఫంక్షన్ లో రెచ్చిపోయారు. 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ , నేషనల్ క్రష్ రష్మిక మందన్న మధ్య లవ్ గట్టిగా నడుస్తుంది అని ఎప్పుటి నుంచో రూమర్ ఉన్న సంగతి తెలిసిందే. వారిద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని.. ముంబయ్ లో డిన్నర్ డేట్లు చేసిన సంగతి కూడా తెలిసిందే. మాల్దీవ్స్ కు ఇద్దరు విడివిడిగా వెళ్లి.. విడివిడిగా ఓకే ప్లేస్ లో ఫోటోలు పెట్టి దొరికిపోయిన సంగతి కూడా తెలిసిందే. ఇంత  జరిగినా మా మాధ్య ఏమీ లేదన్నట్టు ఉంటున్నారే తప్పించి.. ఈ విషయాన్ని గట్టిగా ఖండించలేదు. వ్యాతిరేకించలేదు. ఇక అప్పుడుప్పుడు ఏదో ఓక సందర్భంలో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ ను ఆడియన్స్ గాని..నెటిజన్లు కాని గుర్తు చేస్తుంటారు. 

తాజాగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమా ఫంక్షన్ లో ఇది బయట పడింది. ఆనంద్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇచ్చి.. పక్కా కమర్షియల్ సినిమాలు కాకుండా.. కాన్సెప్ట్ సినిమాలు చేసుకుంటున్నాడు.  కథలోను .. తన పాత్ర విషయంలోను కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక తాజాగా  ఆయన చేసిన సినిమానే బేబి. వైష్ణవి చైతన్య  హీరోయిన్లుగా నటించిన ఈసినిమాలో విరాజ్ అశ్విన్ కీలకమైన పాత్రను పోషించాడు. సాయిరాజేష్ నీలం అనే టాలెంటెడ్ మేకర్ ఆసినిమాతో దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నాడు. 

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ లాంచ్ ఈవెంట్, హైదరాబాద్ - పీవీఆర్ ఆర్కే సినీ ప్లెక్స్ - స్క్రీన్ 1లో జరిగింది. నేషనల్ క్రాష్ రష్మిక చేతుల మీదుగా ఈ సినిమా నుంచి 'ప్రేమిస్తున్నా' అనే  లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.'ప్రేమిస్తున్నా ... ప్రేమిస్తున్నా .. నీ ప్రేమలో జీవిస్తున్నా' అంటూ సాగే పాటను  విజయ్ బుల్గనిన్ స్వరపరిచిగా... సురేశ్ బానిశెట్టి సాహిత్యాన్ని అందించగా, రోహిత్ పాడారు. ఇక ఈపాట రిలజ్ సందర్భంగా  రష్మికకు కాస్త షాక్ ఇచ్చారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. 

ఈ ఈవెంట్ లో రష్మిక మందన్నా, ఆనంద్ దేవరకొండ మాట్లాడుతున్న సమంయంలో.. వదినా వదినా అంటూ అరుపులతో.. హడావిడి చేశారు. ఆనంద్ దేవరకొండకు వదిన రష్మిక మందన్న.. మరిదికోసం ఇలా సాయానికి వచ్చింది అన్న అర్ధం వచ్చేలా వదినా వదినా అంటూ అరుపులు హాల్ లో  వినిపింయా. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ ఫ్యాన్స్ కూడా రష్మికను తమ హీరో లవర్ గా పిక్స్ అయినట్టు తెలుస్తోంది. 

ఆనంద్ దేవరకొండ సినిమా ఫంక్షన్ కు పాన్ ఇండియా హీరోయిన్  గా క్రేజ్ ఉన్న రష్మిక రావడానికి కారణం విజయ్ తో ఉన్న రిలేషన్ అంటున్నారు సినీ జనాలు. పైగా ఫంక్షన్ లో వదినా వదినా అని అరుపులు వినిపిస్తున్నాప్పుడు కూడా రష్మిక గట్టిగా నవ్వుతూ ఎంజాయ్ చేసింది కాని.. ఎవరిని వారించలేదు.. దాని గురించి మాట్లాడలేదు కూడా. దాంతో.. రష్మిక వచ్చింది విజయ్ మాటమీదనే అని.. ఆనంద్ కోసం ఆమె రావడంతో.. మరోసారి రౌడీ హీరోతో రష్మిక రిలేషన్ బయట పడిందంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Dhanush: విజయ్ సేతుపతి సినిమాకి మొండిచేయి, కానీ రాయన్ కి అవార్డు.. ధనుష్ షాకింగ్ రియాక్షన్ వైరల్
Tollywood Villains: స్క్రీన్ పై వణుకుపుట్టించే విలన్లకు అందమైన భార్యలు, సోనూసూద్ నుంచి షాయాజీ షిండే వరకు