
కన్నడ నటి అను గౌడకి ఆమె స్వగ్రామంలో తీవ్ర సమస్యలు ఎదురయ్యాయి. ఏకంగా ఆమెపై కొందరు దాడి చేశారు. ఈ ఘటనలో అను గౌడ తలకి గాయం కావడంతో రక్త స్రావం జరిగింది. వెంటనే ఆమెని ఆసుపత్రికి తరలించారు. అను గౌడ కన్నడ నాట బుల్లితెరపై, వెండితెరపై నటిగా గుర్తింపు సొంతం చేసుకుంది. టివి సీరియల్స్ తో పాపులర్ అయిన ఆమె.. ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాల్లో కూడా క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది.
అసలు అను గౌడపై దాడి ఎందుకు జరిగిందో వివరాల్లోకి వెళదాం. అను గౌడ కర్ణాటకలోని షిమోగా జిల్లాలో కస్పాడీ అనే చిన్న గ్రామం ఆమె స్వస్థలం. ఆ గ్రామంలో అను గౌడకి కొంత వ్యవసాయ భూమి ఉంది. ఈ ల్యాండ్ విషయంలోనే చాలా కాలంగా వివాదం నెలకొంది. ఆ గ్రామంలోని కొందరు ల్యాండ్ తమకి చెందినది అంటూ అను గౌడతో గొడవకి దిగుతున్నారు.
ఈ వివాదం ఇలాగే కొనసాగుతోంది. అయితే రీసెంట్ గా అను గౌడ కస్పాడికి వెళ్ళింది. ల్యాండ్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని అను తేల్చి చెప్పింది. తన తల్లి దండ్రులు ఈ భూమిలో వ్యవసాయం చేశారని, ఇది తమ కుటుంబానికి చెందిన ల్యాండ్ అని అను వారికి తేల్చి చెప్పింది.
దీనితో ఈ వివాదంలో ఉన్న నీలమ్మ, మోహన్ అనే ఇద్దరు వ్యక్తులు అను గౌడపై తీవ్రమైన దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో అను గౌడ తలకి బలమైన గాయం అయింది. తీవ్రంగా రక్త స్రావం కావడంతో ఆమెని ఆసుపత్రికి తరలించారు. ఏ ఘటన తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలిసుల దర్యాప్తు కోనసాగుతోంది. అను గౌడ కిచ్చా సుదీప్ , శివరాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో పాత్రలు చేసింది.