'ఖుషీ'కి లింక్ వేస్తున్న ‘హరి హర వీరమల్లు’...భలే ఐడియా

By Surya PrakashFirst Published Dec 21, 2022, 11:45 AM IST
Highlights

పవన్ పుట్టినరోజు సందర్భంగా.. ‘ఖుషి ట్రైలర్ రీలోడెడ్’ పేరుతో స్పెషల్‌గా ట్రైలర్స్ కట్ చేయగా నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.


సినిమా వాళ్లు ప్రమోషన్స్ కొత్త కొత్త ఆలోచనలు చేస్తూంటారు. తాజాగా అలాంటి ఓ ఐడియా వచ్చింది  ‘హరి హర వీరమల్లు’టీమ్ కు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు టైప్ లో ముందుకు వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు. ఇది ఆనందం కలిగించే విషయమే ఫ్యాన్స్ కు.  అదేమిటంటే....

 పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ‘ఖుషి’ సినిమాది ఓ ప్రత్యేకమైన స్థానం అన్న సంగతి తెలిసిందే. 2001 ఏప్రిల్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడమే కాక హీరోగా పవన్ కళ్యణ్ కెరీర్‌ను మలుపుతిప్పింది.  పవన్  హీరోగా  నటించిన 7వ సినిమా ఇది.. అప్పటి యూత్‌లో పవర్ స్టార్ క్రేజ్‌ని, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని  రెట్టింపు చేసిన చిత్రం ఇది.   ఇప్పటికీ ‘ఖుషి’ టీవీలో టెలికాస్ట్ అవుతున్నా సరే మిస్ కాకుండా చూస్తుంటారు. ఇప్పుడీ సినిమా 21 సంవత్సరాల తర్వాత మళ్లీ థియేటర్లలో సందడి చెయ్యబోతుంది.  

2023 నూతన సంవత్సరం సందర్భంగా 2022 డిసెంబర్ 31న ‘ఖుషి’ మూవీని వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రీ రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. ఇదే సమయంలో  మరో  సర్‌ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నారు నిర్మాతలు. అదేంటంటే..  డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో.. ‘ఖుషి’ నిర్మాత ఏ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న హిస్టారికల్ ఫిలిం ‘హరి హర వీరమల్లు’.. ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు టీజర్స్ ఆకట్టుకున్నాయి. మరో కొత్త టీజర్ కట్ చేసి.. దాన్ని ‘ఖుషి’రీ రిలీజ్ థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు.

పవన్‌ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. పీరియాడిక్‌ యాక్షన్ అడ్వేంచర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్ర బృందం రిలీజ్‌ చేసిన పోస్టర్‌లు, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.  పదిహేడవ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల కాలం నాటి కథాంశంతో క్రిష్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్, న‌ర్గీస్ ఫ‌క్రి న‌టిస్తున్నారు. మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై ఏ. ద‌యాక‌ర్ రావు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎమ్‌. ఎమ్ కీర‌వాణి సంగీతం అందిస్తున్నాడు. 
 

click me!