ప్రముఖ అందాల నటుడు హరనాథ్‌ కూతురు హఠాన్మరణం..

Published : Dec 20, 2022, 05:22 PM IST
ప్రముఖ అందాల నటుడు హరనాథ్‌ కూతురు హఠాన్మరణం..

సారాంశం

ప్రముఖ నటుడు హరనాథ్‌ కూతురు పద్మజా రాజు(54)శారు. ప్రముఖ నిర్మాత జి.వి.జి రాజు భార్య అయిన పద్మజా రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.

ప్రముఖ అలనాటి అందాల నటుడు హరనాథ్‌ కూతురు పద్మజా రాజు(54)శారు. ప్రముఖ నిర్మాత జి.వి.జి రాజు భార్య అయిన పద్మజా రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. పద్మజాకి ఇద్దరు కుమారులున్నారు. ఆమె సోదరుడు శ్రీనివాస రాజు కూడా నిర్మాతనే కావడం విశేషం. పద్మజా రాజు భర్త అయిన నిర్మాత జీవీజీ రాజు.. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన `గోకులంలో సీత`, `తొలి ప్రేమ` చిత్రాలను నిర్మించారు. 

మరోవైపు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో `గోదావరి` చిత్రానికి కూడా ఆయనే నిర్మాత. భర్తకి అన్ని విధాలుగా చేదోడువాదోడుగా ఉండేవారు ఆయన పద్మజా రాజు. ఇటీవల పద్మజా రాజు తన తండ్రి హరనాథ్‌ గురించి `అందాల నటుడు` పేరుతో ఓ పుస్తకం తీసుకొచ్చారు. ఆ పుస్తకాన్ని సూపర్‌ స్టార్‌ కృష్ణ చేతుల మీదుగా విడుదల చేయడం విశేషం. ఈ నేపథ్యంలో పద్మజా రాజు మీడియాతో మాట్లాడుతూ, `త్వరలోనే తన కుమారుల్లో ఒకరు నిర్మాతగా పరిచయం కానున్నారని తెలిపారు. 

వచ్చే ఏడాది తన కుమారుడిని నిర్మాతగా పరిచయం చేసే పనుల్లో ఉన్న పద్మజా, ఆమె భర్త జీవీజీ రాజు బిజీగా ఉండగా, అంతలోనే ఆమె హఠాన్మరణం చెందడం వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇది సినీ ప్రముఖులను సైతం కలచి వేసింది. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకి శాఆంతి చేకూరాలని, వారి ఫ్యామిలీకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవి అంటే ఏంటో ఇండస్ట్రీకి చూపించిన 5 సినిమాలు..ఇవి లేకుంటే మెగాస్టార్ కెరీర్ ఫినిష్
ఓటీటీలో మన శంకర వరప్రసాద్ గారు వచ్చేది ఎప్పుడో తెలుసా? ఎక్కడ చూడొచ్చంటే?