రాజకీయాలు నాకొద్దు బాబోయ్ అంటున్న తారక్

First Published Mar 17, 2018, 12:37 PM IST
Highlights
  • సరైన టైం లో సక్సెస్ ట్రాక్ లో పడ్డ జూనియర్ ఎన్టీఆర్
  • టెంపర్ - నాన్నకు ప్రేమతో - జనతా గ్యారేజ్ - జై లవకుశ సినిమాలో సూపర్ హిట్లతో దూసుకుపోతున్నాడు
  • ఈ నేపధ్యంలో జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ గురించి ఆలోచించే స్థితిలో లేడు​

నిన్నటి సంగతి వేరు నేటి సంగతి వేరు. కాలం ఒకలా ఉండదు. ఇప్పుడు ఎన్టీఆర్ టైం మామూలుగా లేదు హిట్ల మీద హిట్లతో దూసుకుపోతున్నాడు. కుటుంబంలో ఎవరి అండ లేకుండ ఒకడే జీవితానికి ఎదురెల్లి గెలిచిన స్టార్. అందరు ఒక వైపు ఎన్టీఆర్ ఒక వైపు అన్నీ ఉన్నా ఏమీ లేని హీరో నుండి అన్నీ తానై నడిచేంత ఎత్తుకు ఎదిగిన ఎన్టీఆర్. ప్రస్తుత రాజకీయాలను గమనిస్తే పవన్ టీడిపికి గుడ్ బై చెప్పడం. వాళ్ల మీద ఆరోపనలు కూడా ఎక్కువ అయ్యాయి. ఇలాంటి సమయంలో అందరి దృష్టి ఎన్టీఆర్ పైనే ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే పార్టీ పుంజుకుంటుందని కార్యకర్తల భావన. అందరి భావన ఇదే చాలా మంది ఇదే ప్రస్తావన చంద్రబాబు వరకు తీసుకెళ్ళారు. కానీ తారక్ వర్షన్ వేరేలా ఉంది.

సరైన టైం లో సక్సెస్ ట్రాక్ లో పడ్డ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో ఏ మాత్రం తొందరపడకుండా జాగ్రత్తగా ఉంటున్నాడు. టెంపర్ - నాన్నకు ప్రేమతో - జనతా గ్యారేజ్ - జై లవకుశ సినిమాలో సూపర్ హిట్లతో దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్ ఊర మాస్ సినిమాలు కూడా ఓవర్సీస్ లో 1.5 మిలియన్ ఈసీగా క్రాస్ చేస్తుంది. అసలు ఓవర్సీస్ లో మాస్ మూవీస్ కి ఆదరణ చాలా తక్కువ.  ఇలాంటి సమయంలో రాజకీయాలు - ప్రచారాలు అంటూ దిగితే సినిమా కెరీర్ కు ఇబ్బంది కలగడమే కాక తనను ఒక వర్గానికే పరిమితం చేసే అవకాశాలు ఉండటంతో కనీసం ఆ ఆలోచన కూడా చేయటం లేదని టాక్. త్రివిక్రమ్ సినిమా పూర్తయ్యే లోపు దీపావళి దాటేస్తుంది. ఆ వెంటనే రాజమౌళితో చరణ్ మల్టీ స్టారర్ లో జాయిన్ అవ్వాలి. దానికి రెండు వందల రోజులకు పైగా జక్కన్న ఇద్దరి నుంచి కాల్ షీట్స్ డిమాండ్ చేసాడని ఇప్పటికే టాక్ ఉంది.

ఈ నేపధ్యంలో జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ గురించి ఆలోచించే స్థితిలో లేడు. నాన్న హరికృష్ణ తటస్థంగా ఉండటం అన్న హీరోగా నిర్మాతగా బిజీ కావడం తనకు వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్ చేతిలో ఉండటం ఈ కారణాలన్నీ దృష్ట్యా అభిమానులు అడిగినా చిరునవ్వు నవ్వి సినిమా గురించి తప్ప దేని గురించీ మాట్లాడే ఆసక్తి అవసరం ఇప్పుడు లేదని జూనియర్ స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ రకంగా చూసుకుంటే తారక్ తెలివైన నిర్ణయాన్ని మెచ్చుకోవాల్సిందే
 

click me!