వామ్మో...సినిమాకు తమన్ తీసుకునేది అంతా!?

Surya Prakash   | Asianet News
Published : May 18, 2021, 07:32 AM IST
వామ్మో...సినిమాకు తమన్ తీసుకునేది అంతా!?

సారాంశం

మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ మంచి జోరు మీద ఉన్నాడు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వరస సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ టాలీవుడ్‌లో టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా దూసుకెళ్తున్నాడు. ‘అల వైకుంఠపురము’లో తర్వాత ఆయన సంగీతంలో మరింత కొత్తదనం కనిపిస్తోందని అంటున్నారు.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది పాత సామెత అయినా సినిమా వాళ్లకు బాగా నచ్చిన సామెత. తమకు క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అని వాళ్ళు నమ్ముతారు. అమలు పరుస్తారు. హీరో కావచ్చు,హీరోయిన్ కావచ్చు, హిట్స్ ఇచ్చిన డైరక్టర్ కావచ్చు, ఊపు మీద ఉన్న మ్యూజిక్ డైరక్టర్ కావచ్చు. ఎవరైనా సరే తమ రేటు టైమ్ చూసి పెంచేస్తారు. వాళ్లు తమంతట తాము పెంచకపోయినా నిర్మాతలు వాళ్ల డేట్స్ కోసం రెమ్యునేషన్  పెంచేసి ఆఫర్ చేస్తారు. ఇప్పుడు అదే తమన్ కు జరుగుతోందిట. నిజానికి ఇప్పుడున్న పరిస్దితుల్లో తమన్ తన రెమ్యునేషన్ పెంచాలనుకోలేదట. కానీ నిర్మాతలు ఒప్పుకోవటం లేదుట.కోటిన్నర నుంచి  రెండు కోట్ల దాకా తమన్ కు ఆఫర్ చేస్తున్నారట పెద్ద సినిమాల వాళ్లు. అందులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్యాకేజ్ కూడా కలిపే ఉందిట. ఒకప్పుడు యాభై లక్షలు ఇచ్చిన నిర్మాతలు సైతం ఇదే రేటుని ఫాలో అయ్యిపోతున్నారట. ముఖ్యంగా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తే సినిమా సూపర్ హిట్టే అంటున్నారు. ఒకప్పుడు మణిశర్మకు ఉండేది ఈ పేరు. ఇఫ్పుడు తమన్ ఈ ప్లేస్ లోకి వచ్చేసాడు. 

ఎందుకిలా అంటే మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ మంచి జోరు మీద ఉన్నాడు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వరస సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ టాలీవుడ్‌లో టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా దూసుకెళ్తున్నాడు. ‘అల వైకుంఠపురము’లో తర్వాత ఆయన సంగీతంలో మరింత కొత్తదనం కనిపిస్తోందని అంటున్నారు. ఇంతకు ముందులా  రొటీన్‌గా కాకుండా ఢిపరెంట్‌ స్టైల్‌లో సంగీతం అందించి ఆకట్టుకుంటున్నాడు. అప్పుడప్పుడూ కాపీ ట్రాక్ లు, తననే తనే అనుకరించుకుంటాడు వంవిటి వినిపించినా...ఆఫర్స్ కు లోటు లేదు. తమన్ ఈ ఏడాది ‘క్రాక్‌’, ‘వకీల్‌సాబ్‌’, ‘వైల్డ్‌ డాగ్‌’ లాంటి పెద్ద సినిమాలకు సంగీతం అందించాడు. వాటిలో క్రాక్, ‘వకీల్‌సాబ్‌’లోని పాటలు జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘మగువా’ సాంగ్‌ సూపర్‌ హిట్‌ అయింది. ఇలా మెలోడీలతో పాటు మాస్‌ సాంగ్స్‌ని కూడా ఆకట్టుకునేలా కంపోజ్‌ చేస్తూ.. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌కు సరైన పోటీగా నిలుస్తున్నాడు.

దాంతో  ప్రస్తుతం తమన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్ర్రస్తుతం తమన్ ఖాతాలో అరడజను కు పైనే సినిమాలున్నాయని తెలుస్తుంది.  ఓవైపు మహేష్ బాబుకు వరుసగా సర్కారు వారి పాట, త్రివిక్రమ్ సినిమాలకు అందిస్తున్నాడు. అలాగే నందమూరి బాలయ్యకు అఖండ సినిమాకు కూడా తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు పలు తమిళ్ సినిమాలకు కూడా తమన్ సంగీతం అందిస్తునాడు.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం