ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లేస్ మార్చిన విశ్వక్ సేన్, ఎప్పుడు..? ఎక్కడా...?

By Mahesh Jujjuri  |  First Published May 2, 2022, 2:36 PM IST

అశోక వనంలో అర్జున్ కళ్యాణం రిలీజ్ హడావిడిలో ఉన్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఈ మూవీ ప్రమోషన్స్ అంటూ రోడ్డు మీద చేసిన హడావిడివల్ల అటు పబ్లిసిటీ.. ఇటు కాంట్రవర్సీ రెండింటినీ ఫేస్ చేస్తున్నాడు మాస్ కా దాస్. ఇక ప్రీరిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో చేయడం లేదు టీమ్. 
 


అశోక వనంలో అర్జున్ కళ్యాణం రిలీజ్ హడావిడిలో ఉన్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఈ మూవీ ప్రమోషన్స్ అంటూ రోడ్డు మీద చేసిన హడావిడివల్ల అటు పబ్లిసిటీ.. ఇటు కాంట్రవర్సీ రెండింటినీ ఫేస్ చేస్తున్నాడు మాస్ కా దాస్. ఇక ప్రీరిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో చేయడం లేదు టీమ్. 

మస్ కా దాస్ విష్వక్సేన్ హీరోగా... రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటించిన సినిమా అశోకవనంలో అర్జున కల్యాణం. బాపినీడు - సుధీర్ నిర్మించిన ఈ సినిమాకి విద్యాసాగర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఈ నెల 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఖరారు చేశారు.

Latest Videos

రీసెంట్ గా ఈసినిమా విషయంలో వివాదం ఫేస్ చేస్తున్నాడు విశ్వక్. ఈ మాస్ హీరో ఫిలింన‌గ‌ర్ రోడ్డులో వెళ్తుంటే ఓ యువ‌కుడు కారుకు అడ్డంగా ప‌డుకొని నడిరోడ్డుపై హల్‌చల్‌ చేశాడు. అశోక వనంలో అర్జున కళ్యాణంలో విశ్వక్‌సేన్‌కి 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు. నేను తట్టుకోలేకపోతున్నా. అందుకే పెట్రోల్‌ పోసుకొని సూసైడ్‌ చేసుకుంటా అంటూ విశ్వక్ కారుకు అడ్డు పడ్డాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇలా ప్లాన్ చేశారు టీమ్. విశ్వక్ చేసిన ఈ వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హెచ్ ఆర్ సీకి ఫిర్యాదు చేసే వరకూ వెళ్ళింది. 

అయితే ఈ చికాకుల వల్ల  ఈ మూవీ ప్రీరిలీజ్ ను హైదరాబాద్ లో కాకుండా ఇతర ప్రాంతాల్లో చేస్తే బాగుంటుంది అనుకున్నారట. అందుకే ప్రశాంతంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఖమ్మంలో చేసుకోబోతున్నారు. రేపు(మే 3) ఖమ్మం లేక్ వ్యూ క్లబ్ లో  సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ఘనంగా జరగబోతోంది. ఇక చీఫ్ గెస్ట్ గా  ఎవరు రానున్నారనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మూవీ టీమ్. 

ఈ సినిమాలో విష్వక్సేన్ సరసన హీరోయిన్ గా రుక్సార్ థిల్లాన్ అలరించనుంది. ఇంతవరకూ విష్వక్సేన్ మాస్ సినిమాలు ఎక్కువగా చేస్తూ వచ్చాడు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు సంపాదించాలనే ఆలోచనతో ఆయన చేసిన సినిమా ఇది. ఈ సినిమా ఆయన కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి.
 

click me!