Acharya: ‘ఆచార్య’నష్టాలను విజయ్ దేవరకొండతో రికవరీ?

By Surya Prakash  |  First Published May 2, 2022, 1:59 PM IST

చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించారు.  



ఆచార్య  సినిమాకు మొదటి షోనుంచే డిజాస్టర్ టాక్ వచ్చింది. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదని, గ్రాఫిక్స్ చెత్తగా ఉన్నాయని.. ఇద్దరూ స్టార్స్ ఉన్నా సినిమా ఎక్కడా కనెక్ట్ అవ్వడం లేదని టాక్ వచ్చింది. ఇక అదే కలెక్షన్స్ విషయంలో కూడా కనిపించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది.  132.50 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ దగ్గర ఆచార్య బరిలో దిగింది. మొదటి రోజే ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో చేతులేత్తేసింది. ఇక రెండో రోజు ,మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా నిరాశ పరిచింది.  వీకెండ్‌లో కూడా ఆక్యుపెన్సీ పడిపోయిన తీరు ట్రేడ్ కు సైతం షాక్ ఇచ్చింది.

ఇక  ఈ సినిమా నైజాం హక్కులను వరంగల్ శ్రీను 39 కోట్లకు విక్రయించారు. ఈ దారుణమైన టాక్ తో ఇప్పుడు నైజాంలోనే దాదాపు 25 కోట్లకు పైగా నష్టపోవడం వరంగల్‌కు భారీ ఎదురుదెబ్బ. అతను కోవిడ్‌కు ముందే ఒప్పందాన్ని చేసుకున్నాడు.  అయితే  మహమ్మారి కారణంగా ఎటువంటి డిస్కౌంట్ పొందలేదు. ఇది కూడా ఇప్పుడు అతన్ని మరింత ఇబ్బంది పెడుతోంది. మరోవైపు, మా సోర్సెస్  ప్రకారం, పూరి జగన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ యొక్క లైగర్   నైజాం హక్కుల కోసం వరంగల్ శ్రీను ఎగ్రిమెంట్ చేయబోతున్నారు. 

Latest Videos

లైగర్ వర్కవుట్ అయితే  పూర్తిగా కాకపోయినా ఆయన నష్టాలకు రికవరీ ఉంటుంది. ఆచార్యతో వరంగల్ శ్రీను మాత్రమే కాదు, ఏపీలోని చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీగా నష్టపోతారు. హక్కులు భారీ మొత్తాలకు అమ్ముడయ్యాయి కానీ విడుదలైన అన్ని ప్రాంతాలలో ఈ చిత్రం ఊహించిన దాని కంటే  ఎక్కువ డిజాస్టర్ అయ్యింది.

చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించారు. రామ్ చరణ్  సిద్ద పాత్రలో అదరగొట్టారు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్  జోడిగా నటించగా ఆ తర్వాత ఆమె పాత్రను తొలగించారు దర్శక నిర్మాతలు. ఇక రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే  నటించారు. ఇక ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్టు సమాచారం.ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ డీల్‌కు సంబంధించిన అన్ని అగ్నిమెంట్స్ కూడా పూర్తైయినట్టు సమాచారం.

click me!