#Hanumanకు ఏషియన్ సినిమాస్ హ్యాండ్ ఇచ్చినట్లా?

By Surya PrakashFirst Published Jan 11, 2024, 12:39 PM IST
Highlights

  లోకల్ గా ఏషియన్ ప్లెక్స్ లు రన్ చేసే పెద్ద చైన్,  నేషనల్ ప్లెక్స్ లు హనుమాన్ కు షాక్ ఇవ్వటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.   దాంతో AMB, AAA లలో కూడా హనుమాన్ కు షోలు ప్రస్తుతానికి లేవు. 

 
స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్  దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ మధ్య చాలా కాలంగా కొన్ని ఇష్యూలు నడుస్తున్న సంగతి తెలిసిందే.  సంక్రాంతి సీజన్ సాక్షిగా ఈ సమస్యలు రోజురోజుకూ వేడి ఎక్కువవుతున్నాయి.  దిల్ రాజు ఏం చేసినా అనైతికమని, హైదరాబాద్ సిటీలో తమకు అవసరమైన సింగిల్ స్క్రీన్‌లు లేవని మైత్రీ మూవీస్ వర్గాలు ఫిర్యాదు చేస్తున్నాయి. ఎగ్రిమెంట్  ప్రకారం హైదరాబాద్  లో 6 థియేటర్లు రావాల్సి ఉండగా చివరకు 4 థియేటర్లు మాత్రమే దక్కాయి. జిల్లాల్లో కూడా హనుమాన్ కు సమస్యలే ఎదురౌతున్నాయి. 

జిల్లాల్లో కూడా హనుమాన్ కు 4 థియేటర్లు రావాల్సి ఉండగా, ఆ స్క్రీన్లు ఇప్పుడు దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమాలకు మారినట్లు సమాచారం. మైత్రీ టీమ్ ఇప్పటికే తమకు తగినంత సింగిల్ స్క్రీన్‌లు రావడం లేదని, కేటాయించిన సింగిల్ స్క్రీన్‌లను సైతం కోల్పోతున్నామని చెప్తున్నారు. ఇది సరిపోదన్నట్లు ఏషియన్ మల్టిప్లెక్స్ చైన్ తో కూడా ఈ సినిమాకు సమస్యలు ఎదురౌతున్నాయి. ఏషియన్ మల్టిప్లెక్స్ వారు ఇప్పటికీ హనుమాన్ కు బుక్కింగ్స్ ఓపెన్ చెయ్యలేదు. మైత్రీతో ఇగో క్లాషెష్ వల్ల ఇది జరిగుతోందని  సమాచారం.  లోకల్ గా ఏషియన్ ప్లెక్స్ లు రన్ చేసే పెద్ద చైన్,  నేషనల్ ప్లెక్స్ లు హనుమాన్ కు షాక్ ఇవ్వటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.   దాంతో AMB, AAA లలో కూడా హనుమాన్ కు షోలు ప్రస్తుతానికి లేవు. మరి ఏమన్నా మ్యాటర్స్ సెటిల్ చేసుకుని షోలు కేటాయించుకునే ప్రయత్నాలు మైత్రీ వారు చేస్తారేమో చూడాల్సి ఉంది. ప్రెస్ ప్రీమియర్ సైతం  AMB నుంచి ప్రసాద్స్ కు షిప్ట్ అయ్యింది. అయితే ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే..ఏషియన్ చైన్ లో ఈ సినిమా ప్రీమియర్స్ పడుతున్నాయి. అవన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. దాంతో ఈ ఇష్యూ ఎటు నుంచి ఎటు వెల్తోంది..ఎవరిది న్యాయం..ఎవరిది కాదు అనే క్లారిటీ లేకుండా పోయింది. 

Latest Videos


   
ఇక జనవరి 12న రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి ముందు రోజే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తుండగా ఆరోజుకు పెట్టిన షోలు పెట్టినట్టే సోల్డవుట్ అయిపోతున్నాయి. దీంతో హనుమాన్ చిత్రాన్ని ఎంత మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని అందరికీ అర్థమవుతోంది. ఈ చిత్రంలో అనేక చిత్రాల్లో బాల నటుడిగా ప్రేక్షకులను అలరించిన తేజ సజ్జ (Teja Sajja) హీరోగా చేస్తున్నారు.  ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. మరోవైపు, సూపర్ స్టార్ మహేశ్‌ బాబు (Mahesh Babu)- డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) అదే రోజున రాబోతోంది. ఈ నేపధ్యంలో చిత్రంకు థియేటర్స్ తక్కువ కేటాయించారని వివాదాలు సైతం వచ్చాయి. అయితే నార్త్ మార్కెట్ ని భారీగా టార్గెట్ చేస్తున్న ‘హను-మాన్‌’ పూర్తి రికవరీ మోడ్ లో ఉందని ట్రేడ్ అంటోంది. 

 ఈ మూవీలో హీరోయిన్‌గా అమృతా అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలయిన టీజర్, ట్రైలర్, పోస్టర్స్.. అన్నీ ఈ జోనర్ సినిమాలు ఇష్టపడేవారిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. పైగా తెలుగులో మాత్రమే కాదు.. ‘హనుమాన్’ను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తున్నారు కాబట్టి ఇతర భాషల్లో కూడా ప్రమోషన్స్ భారీగానే జరుగుతున్నాయి. ఫైనల్‌గా  సంక్రాంతికి ‘గుంటూరు కారం’ వర్సెస్ ‘హనుమాన్’ పోటీ తప్పదని అర్థమవుతోంది.

click me!