
రవీందర్ చంద్రశేఖర్ లిబ్రా ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను నడుపుతున్నారు. ఆ సంస్థ ద్వారా డ్రమ్ స్టిక్ చిప్స్ వంటి చిత్రాలను నిర్మిస్తున్నాడు. నిర్మాతగానే కాకుండా బిగ్ బాస్ షోపై విమర్శకుడుగా కూడా రవీందర్ తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. తన ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రతిరోజూ బిగ్ బాస్ షో పై రివ్యూ ఇస్తూ ఉంటాడు.ఇక ఆమధ్య ఈ నిర్మాత ఎక్కువగా వార్తల్లో నిలిచాడు.
అప్పటికే పెళ్లై విడాకులు తీసుకున్న రవీందర్ 2022లో రెండో పెళ్లి చేసుకున్నాడు. భర్తను వదిలేసి విడాకులు తీసుకున్న వివాదాస్పద నటి సీరియల్ స్టార్ మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో వీరి పెళ్లి చాలా చర్చనీయాంశమైంది. దీనితో పాటు నటి మహాలక్ష్మి డబ్బు కోసమే రవిందర్ ను పెళ్లి చేసుకున్నారనే విమర్శలు కూడా వచ్చాయి.
పెళ్లయిన ఏడాదికే నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ జైలుకు వెళ్లాడు. రవీందర్ చంద్రశేఖర్ సినిమా షూటింగ్ పేరుతో మనీలాండరింగ్ చేశారని. ఓ వ్యక్తి దగ్గర డబ్బుతీసకునిఇవ్వలేదన్నట్టు కేసు నమోదు అవ్వడంతో నెలకు పైగా జైలు జీవితం గడిపారు. రవీందర్ జైల్లో ఉన్నప్పుడు మమాలక్ష్మికూడా అతనిపై విమర్షలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన తమిళ ప్రొడ్యూసర్.. ప్రస్తుతం జరుగుతున్న తమిళ బిగ్ బాస్ సీజన్ 7 పై విమర్శలు చేయడం మొదలుపెట్టాడు.
ఈ నేపధ్యంలో ఇటీవల బిగ్ బాస్ షో సమీక్షకు వచ్చిన ఆయన.. అనారోగ్యంతో కనిపించారు. ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగింది. అయినా సరే తన య్యూట్యూబ్ ఛానెల్ లో రివ్యూ ఇచ్చాడు. అయితే ముక్కులో ఆక్సిజన్ ట్యూబ్ పెట్టుకుని మరీ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నాడు రవీందర్. ఆ తర్వాత ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ వచ్చిందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని, దీంతో వారం రోజులుగా ఐసీయూలో ఉంచి చికిత్స అందించామని రవీందర్ వెల్లడించారు. ఇది విన్న అభిమానులు ఆయన ఆరోగ్యం కోలుకునే వరకు బిగ్ బాస్ పై విమర్శలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.