
బలగం సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు మెగాస్టార్ చిరంజీవి. టీమ్ అంతటిని అభినందించారు ప్రత్యేకంగా ఈసినిమా దర్శకుడు వేణుని ప్రత్యేకంగా అభినందించిన మెగాస్టార్.. సినిమాను చక్కగా రూపొందించావంటూ ప్రశంసించారు. అంతే కాదు ఇంత బాగా సినిమా చేసి మాకు షాక్ ఇస్తే ఎలా అంటూ చమత్కరించారు. సరదాగా నవ్వులు పూయించారు. ప్రస్తుతం భోళా శంకర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న మెగాస్టార్ దగ్గరకు బలగం టీమ్ ను తీసుకువచ్చారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఈసినిమా సెట్ లోనే బలగం టీమ్ అంతటిని సన్మానించారు చిరు. శాలువా, బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఇది నిజాయతీ ఉన్న సినిమా ... కమర్షియల్ ప్రొడ్యూసర్ ఉన్నాకూడా.. సినిమాకు నువ్వే పూర్తి న్యాయం చేశావు. తెలంగాణ సంస్కృతిని వంద శాతం చూపించావ అంటూ వేణుని ప్రశంసించారు చిరంజీవి. వేణు గతంలో జబర్దస్త్ షోలో చేసిన స్కిట్ చూశానని, అతడిలో ఇంత టాలెంట్ ఉందా? అనిపించిందని, ఒగ్గు కథలు వంటివి బాగా చేశాడని ప్రశంసించారు. ఈసినిమాతో అతనిపై గౌరవం పెరిగిందని అన్నారు మెగాస్టార్. అంతే కాదు ఈ సినిమా చూశాక తన టాలెంట్ ను మరోసారి నిరూపించుకున్నాడని మెగా ఆశీర్వచనాలు అందించారు.
అయితే బలగం టీమ్ ను చిరు సత్కారం చేసిన వీడియోను టాలీవుడ్ స్టార్ కమెడియన్ ప్రియదర్శి తన ట్విట్టర్ పేజ్ లో షేర్ చేశారు. చిరంజీవి అన్నయ్యా.. మీ సినిమాలు చూసి స్ఫూర్తి పొందాను. అలాంటిది ఈ రోజు మీ పక్కన నిల్చొని మీ ప్రేమను,బ్లెస్సింగ్స్ పొందడం ..జీవితంలో మర్చిపోలేదు.. ఈ ఆనందం గుర్తుండిపోతుంది అంటూ రాసుకొచ్చాడు. అంతే కాదు బలగం సినిమా కోసం మీరు చేసిన ప్రతి దానికి ధన్యవాదాలు. ఏదో ఒక రోజు మీతో కలిసి పని చేస్తున్నానని ఆశిస్తున్నా అని ప్రియదర్శి ట్వీట్ చేశారు.
ఇక జబర్థస్త్ కమెడియన్ గా పాపులారిటీ సంపాదించిన వేణు.. అంచలంచలుగా ఎదిగి ధర్శకుడిగా మారాడు. బలగం సినిమాతో తన సత్తా ఏంటో నిరూపించాడు. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది బలగం.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను తెరపై ఆవిష్కరించిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. విమర్షకుల నుంచి కూడా బలగం సినిమాకు ప్రశంసలు అందుతున్నాయి.